ఉదయం లేవగానే పరిగడుపుతో ఈ ఆకు తినడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..

ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది ప్రజలు ఆరోగ్యం పై శ్రద్ధ చూపుతున్నారు.అది కూడా ఇంగ్లీష్ మెడిసిన్ ను ఉపయోగించకుండా ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నారు.

 Health Benefits Of Eating Basil Leaves On Empty Stomach Details, Health Benefits-TeluguStop.com

ఆయుర్వేదంలో చాలా రకాల మందులను తయారు చేయడానికి ప్రకృతిలో మనకు అందుబాటులో ఉన్న మొక్కలను ఉపయోగిస్తూ ఉంటారు.అందులో ఆయుర్వేద మొక్కలలో ప్రధానమైన మొక్కగా తులసి మొక్క కూడా ఉంది.

ఈ మొక్క పచ్చి ఆకులను నమిలి తినడం వల్ల మధుమేహంతో సహా చాలా వ్యాధులను నయం చేసుకునే అవకాశం ఉంది.

ఇది ప్యాంక్రియాస్ బీటా కణాలు సరిగ్గా పని చేయడానికి ఉపయోగపడుతుంది.

దీని కారణంగా, శరీరంలో ఇన్సులిన్ సమాన పరిమాణంలో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి మెరుగ్గా ఉండి మధుమేహం రాకుండా కాపాడుతుంది.

ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని తులసి ఆకులను శుభ్రమైన నీటితో కడిగి నములుతూ ఉంటే నోటి దుర్వాసన తగ్గుతుంది.వాతావరణం మారినప్పుడు గొంతు నొప్పిని తొలగించడానికి తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి.

ఆ నీటిని ఫిల్టర్ చేసి, శుభ్రం చేసిన తర్వాత నెమ్మదిగా కొద్దికొద్దిగా త్రాగడం మంచిది.

Telugu Basil, Empty Stomach, Benefits, Tips, Immunity, Throat Problem, Tulsi-Tel

ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందే అవకాశం ఉంది.మానసిక ఒత్తిడిని తగ్గించే కార్టిసోల్‌ను తగ్గించడానికి తులసి ఆకు రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది.ఒత్తిడితో పోరాడుతున్న వారికి కూడా తులసి ఆకుల వినియోగం ప్రయోజనకరంగా ఉంటుంది.

ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 12 తులసి ఆకులను నమలడం వల్ల ప్రయోజనం కలుగుతుంది.తులసి ఆకులు ప్రతిరోజు ఉదయం తినడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

అంతేకాకుండా తులసి ఆకుల వల్ల జలుబు, తలనొప్పి, అలర్జీ, సైనసైటిస్‌లో దివ్యౌషధంగా పనిచేస్తుంది.ఇందుకోసం ముందుగా తులసి ఆకులను నీటిలో వేసి మరిగించాలి.

ఆ తర్వాత నీటిని ఫిల్టర్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దికొద్దిగా త్రాగడం వల్ల వెంటనే ఉపశమనం పొందే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube