విజయ్ దేవరకొండకు పెళ్లి అయిపోయింది.. నటి షాకింగ్ కామెంట్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో రౌడీ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.లైగర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండకు ఈ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చినప్పటికీ ఈయనకు మాత్రం ఎంతో మంచి అభిమానులను సంపాదించి పెట్టింది.

 Janhvi Kapoor Says Vijay Devarakonda Is Pratically Married Details, Janhvi Kapoo-TeluguStop.com

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు విజయ్ దేవరకొండ తమ క్రష్ అంటూ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఇకపోతే బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కరణ్ టాక్ షోలో పాల్గొని విజయ్ దేవరకొండ రష్మిక డేటింగ్ లో ఉన్నారంటూ చేసినటువంటి కామెంట్స్ మనకు తెలిసిందే.

అయితే ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జాన్వీ మరోసారి విజయ్ దేవరకొండ గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.ఈ క్రమంలోనే యాంకర్ నటి జాన్వీను ప్రశ్నిస్తూ నీ స్వయంవరం కోసం ముగ్గురు హీరోల పేర్లను ఎంచుకోమని చెప్పారు.

ఈ క్రమంలోనే ఈమె హృతిక్- రణబీర్ – టైగర్ అని మూడు పేర్లు చెప్పారు.ఇలా ఈ ముగ్గురు పేర్లు చెప్పగానే వెంటనే హోస్ట్ విజయ్ దేవరకొండ పేరు సజెషన్ చేశారు.

ఇలా విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే జాన్వి కపూర్ తను ఆచరణాత్మకంగా వివాహం చేసుకున్నాడు అని వ్యాఖ్యానించింది.

Telugu Janhvi Kapoor, Liger-Movie

ఇలా ఈమె విజయ్ దేవరకొండకు పెళ్లి జరిగింది అంటూ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.జాన్వీకపూర్ విజయ్ గురించి ఇలా కామెంట్ చేయడం వెనుక ఓ కారణముంది విజయ్ దేవరకొండ రష్మికతో డేటింగ్ లో ఉన్నారంటూ పలుమార్లు వ్యాఖ్యానించిన ఈమె మరోసారి కన్ఫర్మ్ చేశారు.విజయ్ దేవరకొండ రష్మిక డేటింగ్ లో ఉన్నారని అయితే ఈ విషయాన్ని వెల్లడించడం లేదంటూ చెప్పుకోచ్చారు.

ఇకపోతే వీరిద్దరూ తాజాగా మాల్దీవుల వెకేషన్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube