బ్రిటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది.భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ చరిత్ర సృష్టించారు.
ఒకప్పుడు భారత్ ను పరిపాలించిన బ్రిటన్ ను.ఇప్పుడు భారత సంతతికి చెందిన వ్యక్తి పాలించబోతున్నాడు.ప్రధాని ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది.దీంతో బ్రిటన్ పీఠం రిషి సునక్ కే దక్కనుంది.ఇప్పటికే సునక్ కు 193 మంది ఎంపీలు మద్దతు లభించింది .కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది మద్దతు కూడా రిషికే దక్కింది.దీంతో ప్రధాని రేసులో మెర్డాంట్ వెనుకబడ్డారు.ఆర్థిక వ్యవహారాలపై పట్టు ఉండటంతో సునక్ వైపు టోరీ ఎంపీలు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.సాధారణంగా పోటీలో ఉండాలంటే కనీసం వందమంది ఎంపీల మద్దతు అవసరం.దీంతో మెర్డాంట్ అర్హత సాధించలేకపోయారు.
ఈ క్రమంలో ఆమె రేసు నుంచి తప్పుకున్నారు.
మొట్టమొదటి బ్రిటిష్ – ఆసియన్ పీఎంగా సునక్ రికార్డ్ సృష్టించారు.ఆయన 1980 మే 12న సౌతాంప్టన్ లో జన్మించారు.1960లో తూర్పు ఆఫ్రికా నుంచి బ్రిటన్ కు వచ్చారు సునక్ తల్లిదండ్రులు.సునక్ తండ్రి జీపీగా పని చేయగా.తల్లి ఫార్మాసిస్ట్ గా పని చేశారు.సునక్ వించెస్టర్ కాలేజీలో చదువుకున్నారు.ఆక్స్ ఫర్డ్ లోని లింకన్ కాలేజీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు.
అనంతంర స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి పుల్ బ్రైట్ స్కాలర్ గా ఎంబీఏ పూర్తి చేశారు.చదువుకునే సమయంలోనే వేసవి సెలవులు వస్తే వెయిటర్ గానూ పని చేసేవారు.
స్టాన్ ఫోర్డ్ లో చదువుకునే సమయంలోనే ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తితో సునక్ కు పరిచయం ఏర్పడింది.అనంతరం ఆమెతో వివాహం జరగగా .వారికి ఇద్దరు కుమార్తెలు.బ్రిటన్ లో టాప్ -250 సంపన్నుల్లో సునక్ దంపతులు స్థానం దక్కించుకున్నారు.2022 నాటికి సునక్ దంపతులు ఆస్తి భారత కరెన్సీలో దాదాపు రూ.6,800 కోట్లు.
2001-04 వరకు గోల్డ్ మన్ శాక్స్ లో ఆయన సేవలు అందించారు.2015 నుంచి రిచ్ మండ్ ఎంపీ గా ఉన్నారు సునక్.అదేవిధంగా కన్జర్వేటివ్ పార్టీ కీలక నేతలలో ఒకరిగా రిషి సునక్ గుర్తింపు పొందారు.అంతేకాకుండా కోవిడ్ సమయంలో బ్రిటన్ లో సునక్ కీలకంగా వ్యవహరించారు.పోస్ట్ కోవిడ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ పటిష్టానికి కృషి చేశారు.