మొబైల్ యూజర్లు రకరకాల టెక్ టిప్స్ పాటిస్తూ అనేక పనులను ఈజీగా చేసుకోవచ్చు.అలాగే సాధ్యం కాని విధంగా కనిపించే పనులు కూడా చేసుకోవచ్చు.
అయితే అందరికీ అన్ని ట్రిక్స్ తెలియకపోవచ్చు.కాగా ఇప్పుడు చాలామందికి తెలియని కొన్ని యూజ్‌ఫుల్ టెక్ టిప్స్ ఏవో తెలుసుకుందాం.
• కాల్ ఎవరు చేశారు
ఈ రోజుల్లో ఎవరు ఫోన్ చేశారనేది ఐడెంటిఫై చేయడానికి మనమందరం ట్రూ కాలర్ వాడుతున్నాం.అయితే ట్రూకాలర్‌లో కూడా ఫేక్ నేమ్ రిజిస్టర్ చేసి ఉంటే వారు ఎవరనేది మనం తెలుసుకోవడం కష్టం.
ఒక సింపుల్ ట్రిక్ ఉపయోగిస్తే మాత్రం అన్నోన్ నంబర్ నుంచి ఎవరు కాల్ చేస్తున్నారనేది ఈజీగా తెలుసుకోవచ్చు.ఇందుకు మీరు మీకు కాల్ చేసిన అజ్ఞాత వ్యక్తి నంబర్ కాపీ చేయాలి.
ఆపై ఫోన్ పేలో ‘ట్రాన్స్‌ఫర్ మనీ టు మొబైల్ నంబర్’పై నొక్కాలి.అనంతరం ‘ఎంటర్ ఏ మొబైల్ నంబర్’ అనే బాక్స్‌లో ఆ నంబర్ పేస్ట్ చేయాలి.
అప్పుడు ఆ వ్యక్తి ఎవరనేది తెలుస్తుంది.ఒకవేళ ఫోన్ పే లేకపోతే ఆ వ్యక్తి ఎవరన్నది తెలియకపోవచ్చు.
• కాల్ లిస్ట్ తెలుసుకోవచ్చు
మీరు ఎయిర్‌టెల్ యూజర్లు అయి ఉంటే.ఒక నెలలో ఎవరెవరితో మాట్లాడారో ఒక లిస్ట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు.ఆ లిస్ట్ పొందడానికి EPREBILL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SEP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఇమెయిల్ ఐడీ పేర్కొని 121కి ఎస్ఎంఎస్ చేయాలి.సింపుల్‌గా చెప్పాలంటే మీరు EPREBILL <మంత్> <ఈమెయిల్ ఐడీ> 121కి ఎస్ఎంఎస్ పంపాలి.
అయితే ఈ ఫోన్ కాల్ హిస్టరీని ప్రస్తుత నెలకి తప్ప గత ఆరు నెలలకు పొందవచ్చు.అంటే ప్రస్తుతానికి మీరు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మంత్ వైజ్‌గా ఏ రోజు ఎవరితో ఎంత సేపు మాట్లాడారనే వివరాల లిస్టు పొందొచ్చు.
• స్పామ్ మెసేజ్‌లకు చెక్
ఎయిర్‌టెల్ యూజర్లు FULLY BLOCK అని టైప్ చేసి 1909కి ఎస్ఎంఎస్ చేస్తే.కమర్షియల్/ప్రొమోషనల్ స్పామ్ మెసేజెస్ రావు.
• ఏ యాప్‌కైనా ఇంటర్నెట్ ఆఫ్ చేయొచ్చు
సాధారణంగా కొందరు తమ మెసేజింగ్ యాప్స్ నుంచి తమకు మెసేజ్‌లు రాకుండా ఆపాలనుకుంటారు.ఇందుకు కొందరు ఇంటర్నెట్ ఆఫ్ చేసుకుంటారు.
అలాంటప్పుడు యూట్యూబ్, బ్రౌజింగ్ యాప్స్, ఇంకా ఇంటర్నెట్ అవసరమయ్యే తదితర సేవలను ఉపయోగించడం కుదరదు.అయితే ఆండ్రాయిడ్ యూజర్లు ప్లే స్టోర్‌లో ఇంటర్నెట్‌గార్డ్ (InternetGuard) అనే యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇంకా ఎన్నో యాప్స్‌కి మొబైల్ ఇంటర్నెట్, వైఫై ఇంటర్నెట్ రాకుండా ఆఫ్ చేసుకోవచ్చు.
• వాట్సాప్ ట్రిక్స్
సాధారణంగా వాట్సాప్‌లో మెసేజ్ పంపించినప్పుడు అవతలి వ్యక్తి ఫోన్ పట్టుకొని ఉన్నా కూడా రిప్లై ఇవ్వకపోవచ్చు.ఇలాంటప్పుడు వారు మెసేజ్ పంపించేలా చేసేందుకు మనం వాట్‌స్పాయిలర్ యాప్ (WhatSpoilerApp) బాగా హెల్ప్ అవుతుంది.
ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఒక అలర్ట్ మాత్రమే బోల్డ్‌గా కనిపించేటట్టు చేసి మెసేజ్‌ను ఓపెన్ చేశాక మాత్రమే అసలు సంగతి చెప్పేటట్టు మెసేజ్ పంపవచ్చు.అప్పుడు మెసేజ్ ప్రివ్యూలో అలర్ట్ మాత్రమే యూజర్లకు కనిపించింది.
అసలు విషయం అనేది రీడ్‌మోర్ అని క్లిక్ చేసిన తర్వాతనే కనిపిస్తోంది.అందుకు వారు వాట్సప్ ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం ఉంటుంది.
దీనివల్ల వారు రిప్లై ఇవ్వక తప్పదు.ఇకపోతే WAMR యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా అవతలి వ్యక్తి డిలీట్ చేసే మెసేజ్‌లను మిల్లీ సెకనులో సేవ్ చేసుకోవచ్చు.