సాధారణంగా కార్మికులు తమకు అనుభవం పెరుగుతున్న కొద్దీ సరికొత్త ఐడియాలతో తమ పనులను మరింత ఈజీగా చేయగలుగుతుంటారు.ఒక్కోసారి వారి చేసే స్మార్ట్ వర్క్ చూస్తే మనం ఆశ్చర్యపోక తప్పదు.
ఐన్‌స్టీన్ లెవల్లో ఆలోచించి వారు ఎంతో కష్టమైన పనులను అత్యంత సులభంగా చేసి సామాన్యులను అబ్బురపరుస్తున్న ఇలాంటి వీడియోలు ఎన్నో ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.అయితే తాజాగా అలాంటి మరొక వీడియో వైరల్ గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్లు స్మార్ట్ వర్క్ చేసిన ఒక వర్కర్ ని పొగుడుతూ మీ థింకింగ్ లెవెల్, ఐడియా సూపరో సూపర్ అని కామెంట్ చేస్తున్నారు.ఈ వీడియోలో టొమాటోలను ట్రక్కులోకి లోడ్ చేయడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఆ కార్మికుడు కనిపెట్టాడు.
వైరల్ వీడియోలో ఒక వ్యక్తి ఒక బుట్ట నిండా టొమాటోలు పోసుకొని ఆ బుట్టను గట్టిగా పైకి విసిరివేయడం చూడవచ్చు.అప్పుడు ఆ బుట్టలోని టొమాటోలు లారీలో పడుతుండగా.
బుట్ట మాత్రం కింద పడుతుంది.బుట్ట మాత్రమే కింద పడేలా టొమాటోలు మాత్రం లారీలో పడేలాగా అతడు తన హ్యాండ్ ట్విస్ట్ చేస్తున్నాడు.
అతని ఫిజికల్ ఫోర్స్ కి టొమాటోలు చాలా చక్కగా లారీలో పడిపోతున్నాయి.బుట్ట మాత్రం కిందికి దిగి వస్తుంది.
దీనివల్ల చాలా సమయం ఆదా అవుతుంది.ఈ టొమాటోల బకెట్లను ట్రక్కులో పడకుండా విసిరివేసే అతని టాలెంట్ చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
@Sagarcasm అనే అకౌంట్ ఈ వీడియోను షేర్ చేసింది.ఈ 13 సెకన్ల క్లిప్‌కి “పవర్ ఆఫ్ ఆర్నాల్డ్, బ్రెయిన్ ఆఫ్ ఐన్‌స్టీన్” అని క్యాప్షన్ జత చేశారు.13 సెకండ్ల నిడివిగల ఈ వీడియోకి ఇప్పటికే ఒక కోటి ఏడు లక్షల వరకు వచ్చాయి.దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
వామ్మో ఇది సైన్సుకి మించిన దాని లాగా ఉందే! అని ఒక యూజర్ కామెంట్ చేశారు.ఈ వీడియోను మీరు కూడా తిలకించండి.