ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా కాంతార సినిమా పేరు మారుమోగిపోతుంది.అన్ని భాషలలో విడుదలైనటువంటి ఈ సినిమా పెద్ద ఎత్తున సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది.
ఈ సినిమాతో రిషబ్ శెట్టి పేరు కూడా పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది.ఇకపోతే హిందీలో కూడా ప్రసారమవుతు ఎంతో ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న ఈ సినిమా గురించి తాజాగా ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందిస్తూ సినిమాపై రివ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా కంగనా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.కాంతార సినిమా చూశాను ఇప్పటికీ నా శరీరం వణుకుతోంది.ఇది ఒక అద్భుతమైన అనుభవం.సాంప్రదాయం, జానపద కథలు, దేశీయ సమస్యల సమ్మేళనమే ఈ చిత్రం.
ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన రిషబ్ శెట్టికి హాట్సాఫ్.సినిమా అంటే ఇది ఇలాంటి సినిమాలను ఇదివరకు ఎప్పుడూ చూడలేదని ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇలాంటి ఓ గొప్ప చిత్రాన్ని అందించినందుకు చిత్ర బృందానికి ధన్యవాదాలు అంటూ ఈమె తెలిపారు.
సినిమా అంటే ఇలాగే ఉండాలి.ఈ సినిమా అనుభూతుల నుంచి మరో వారం రోజులపాటు తాను బయటపడలేనని ఈ సందర్భంగా ఫైర్ బ్రాండ్ కంగన ఈ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అదేవిధంగా వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుకలలో భాగంగా ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం పక్కా అంటూ ఈమె ధీమా వ్యక్తం చేశారు.
మన దేశ సంస్కృతిని సాంప్రదాయాలను ఎంతో అద్భుతంగా ప్రేక్షకులకు చూపించిన ఇలాంటి ఓ గొప్ప సినిమాకు తప్పకుండా ఆస్కార్ రావాలంటూ ఈమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు.