సౌత్ సినిమాలలో నటించాలని ఉంది.. మనసులో కోరిక బయటపెట్టిన బాలీవుడ్ నటుడు?

కరోనా తరువాత చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి.

ఈ క్రమంలోనే దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో వచ్చే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు దక్షిణాది సినిమాలపై మనసు పారేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు దక్షిణాది సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ భాగస్వామ్యం అవుతున్నారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సంజయ్ దత్ ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కే జి ఎఫ్ 2సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

ఇలా ఈ సినిమాలో ఈయన నటనకి మంచి ఆదరణ లభించింది.ఈ క్రమంలోనే కన్నడ చిత్ర పరిశ్రమలో ధ్రువ్‌ సర్జా హీరోగా తెరకెక్కుతున్న సినిమా కేడీ.

ఈ సినిమా టీజర్‌ హిందీ వర్షన్‌కు బాలీవుడ్‌ ప్రముఖ హీరో సంజయ్‌ దత్‌ తన గాత్రాన్ని అందించారు.

Advertisement

ఈ క్రమంలోనే టీజర్ వేడుకలో భాగంగా సంజయ్ దత్ మాట్లాడుతూ.కే జి ఎఫ్ అంటే అద్భుతమైన సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది.ఈ క్రమంలోనే తనకు మరిన్ని సౌత్ సినిమాలలో నటించాలని కోరిక ఉందంటూ ఈయన తెలిపారు.

దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలన్నీ కూడా దర్శకులు సినిమాపై ఉన్న ప్రేమను సినిమాల ద్వారా చూపిస్తారు.వారికి సినిమాపై ఉన్న ప్రేమంతా వారు తీసే సినిమాలలో కనబడుతుందనీ ఈయన దక్షిణాది సినిమాలపై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ క్రమంలోనే ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు