నిద్ర‌లేమిని త‌రిమికొట్టే సూప‌ర్ డ్రింక్‌.. అస్స‌లు మిస్ అవ్వ‌కండి!

నిద్రలేమి.ఇటీవల రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఎందరినో పట్టిపీడిస్తున్న సమస్య ఇది.నిద్రలేమిని ఎంత నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యానికి అంత ముప్పు పెరుగుతుంది.నిద్రలేమి వల్ల డిప్రెషన్, వెయిట్ గెయిన్, హార్ట్ ఎటాక్, డయాబెటిస్ తదితర వ్యాధులు చుట్టుముట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

 Insomnia Will Go Away If You Take This Super Drink! Insomnia, Super Drink, Lates-TeluguStop.com

అందుకే నిద్రలేమిని నివారించుకోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే నిద్రలేమిని వదిలించుకోవడానికి చాలా మంది మందులు వాడుతుంటారు.

అయితే సహజంగా కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్ అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ డ్రింక్ ను తీసుకుంటే నిద్రలేమి నుంచి చాలా త్వరగా బయటపడొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటో.

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక‌ అరటి పండును తీసుకుని వాటర్ తో వాష్ చేసుకోవాలి.ఇలా వాష్ చేసుకున్న అరటి పండును తొక్క తీయకుండానే స్లైసెస్ గా కట్ చేయాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్‌ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో అరటి పండు స్పైసెస్ వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.

అనంతరం స్టవ్ ఆఫ్ చేసి వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Tips, Insomnia, Latest, Problems-Telugu Health Tips

ఈ వాటర్ లో పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, చిటికెడు యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేస్తే నిద్రలేమిని తరిమికొట్టే మన సూపర్ డ్రింక్‌ సిద్ధం అవుతుంది.నిద్రించడానికి గంట ముందు ఈ డ్రింక్ ను తీసుకోవాలి.ఇలా ప్రతిరోజు చేస్తే నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.

ప్రశాంతమైన మరియు సుఖమైన నిద్ర మీ సొంతం అవుతుంది.పైగా ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యల నుంచి సైతం విముక్తి లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube