టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు..!!

టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు అయింది.జూటూరులో అధికార పార్టీ నేతలపై జేసీ వర్గీయులు దాడి చేయడం జరిగిందట.

 Case Registered Against Tdp Leader Jc Prabhakar Reddy , Ysrcp, Tdp, Jc Prabhaka-TeluguStop.com

ఈ క్రమంలో జెసి ప్రభాకర్ రెడ్డితో పాటు మరో 13 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు.అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రతోనే దాడి జరిగిందని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

ఈ దాడికి సంబంధించిన ఘటనలో ఐదుగురు తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.

జూటూరులో.

రెండు రోజుల క్రితం స్థలం విషయంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.

అయితే దాడి జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రతోనే జరిగినట్లు పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.గతంలోనే జెసి ప్రభాకర్ రెడ్డి పై పలు కేసులు నమోదు కావడం తెలిసిందే.

 వైసీపీ అధికారంలోకి వచ్చాక తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న టైంలోనే జెసి ప్రభాకర్ రెడ్డి తో పాటు 120 మంది టీడీపీ కార్యకర్తలపై గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు.ఇప్పుడు జెసి ప్రభాకర్ రెడ్డి తో పాటు 13 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు పెట్టడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube