విజయనగరం జిల్లాలోని మహారాజా ప్రభుత్వ జిల్లా కేంద్ర ఆస్పత్రి పేరు మార్పు చర్చనీయాంశంగా మారింది.మహారాజా ఆస్పత్రి పేరును ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
ముందస్తు ప్రకటన ఏమి లేకుండా ఆకస్మాతుగా పేరు మార్పుపై విపక్ష పార్టీ నేతలు భగ్గుమంటున్నారు.రాత్రికి రాత్రే ఆస్పత్రి బోర్డు మార్చారని మండిపడుతున్నారు.
అదేవిధంగా మహారాజా పేరు తొలగించడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.దీంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.