మేడ్చల్ జిల్లా చీర్యాల్ గ్రామంలో విషాదం నెలకొంది.నాటకం చెరువులో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు.
సరదాగా ఈత కోసం వెళ్ళిన తొమ్మిది మంది విద్యార్థుల్లో ముగ్గురు గల్లంతయినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహం లభ్యమైంది.
మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.విద్యార్థులంతా తీగల కృష్ణారెడ్డి కాలేజ్ కి చెందిన వారిగా గుర్తించారు.