అతి తక్కువ సమయంలోనే రెండు ప్రమాదాలు.. హెల్మెట్ లేకుంటే అంతే సంగతులు

బైక్ నడిపేటప్పుడు చాలా మంది హెల్మెట్ పెట్టుకోరు.హ్యాండిల్‌పై చేతులు వేసి రయ్యిన పోతుంటారు.

 Delhi Police Shared Road Safety Video Viral Details, Delhi Police, Helmet, Wear-TeluguStop.com

వారు కరెక్ట్‌గా బైక్ నడిపినా, ఎదుటి వారి వల్ల కూడా ఒక్కోసారి ప్రమాదాలు వస్తుంటాయి.ఏదేమైనా అతివేగం, నిబంధనలు ఉల్లంఘించడం వంటివి రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.

దీంతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు.కుటుంబాల్లో తీరని శోకం మిగుల్చుతున్నారు.

అందుకే ప్రమాదాల్లో ప్రాణాపాయం నుంచి కాపాడుకోవాలంటే వాహనదారులంతా హెల్మెట్ పెట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తుంటారు.హెల్మెట్ ధరించని వారికి శిక్షలు వేస్తూ ఉంటారు.

ఎన్ని ఫైన్‌లు వేసినా కొందరు వాహనదారులు పట్టించుకోరు.తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉంటారు.

తీరా ప్రమాదాల బారిన పడ్డాక కానీ తెలిసి రాదు.అయితే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది.

ఢిల్లీ పోలీసులు తాజాగా ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.అందులో ఓ యువకుడు హెల్మెట్ ధరించి బైక్‌పై పోతూ ఉంటాడు.అయితే క్షణాల వ్యవధిలో రెండు సార్లు అతడు రోడ్డు ప్రమాదాల బారిన పడతాడు.ఆశ్చర్యకరంగా రెండు ప్రమాదాలు జరిగినా, అతడి ప్రాణాలకు ఏమీ కాదు.

అతడు సురక్షితంగా బయటపడ్డాడు.దీనికి కారణం అతడు హెల్మెట్ ధరించి ఉండడమే.

హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎంత ఉపయోగం ఉందో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది.

కేవలం హెల్మెట్ పెట్టుకోవడం వల్లే అతడి ప్రాణాలు నిలిచాయని చెప్పడమే ఢిల్లీ పోలీసుల ఉద్దేశం.ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.నిబంధనలు చాలా మంది ఉల్లంఘిస్తుంటారని, హెల్మెట్ పెట్టుకోరని, అయితే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కలిగే లాభమేంటో ఈ వీడియో చూడగానే అర్థం అవుతుందని వివరిస్తున్నారు.

ప్రమాదాలు చెప్పి రావని, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల విలువైన ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube