కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం టిఆర్వికేఎస్ జిల్లా గౌరవాద్యక్షులు ఆర్జేసి కృష్ణ

విద్యుత్ రంగ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని టిఆర్వికెఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు గుండాల కృష్ణ అన్నారు.రూరల్ డివిజన్ పరిధిలో ని విద్యుత్ శాఖ లో పలు సెక్షన్ లలో విధులు నిర్వహిస్తున్న హెచ్_82 నుండి ఆర్టి జన్ కార్మికులు మంగళ వారం పలువురు టిఆర్ ఎస్ పార్టీ అనుబంధ టిఆర్వికెఎస్ సంఘం లో చేరారు.

 Trvks District Honorary President Rjc Krishna Said That The Welfare Of The Worke-TeluguStop.com

వీరికి కృష్ణ కండువాలు కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తున్న విద్యుత్ శాఖ పట్ల కెసిఆర్ కు ప్రత్యేక అభిమానం ఉందన్నారు.

దీనిలో భాగంగా నే పలు సమస్యలు పరిష్కరించారని తెలిపారు.అదేవిదంగా జిల్లా లో కూడా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆద్వర్యంలో పలు సమస్య లను ఇప్పటికే పరిష్కరించు కున్నామని తెలిపారు.

దీనిని చూసిన ఇతర సంఘాల వారు వారి సమస్యల పరిష్కారం కోసం సంఘం లో చేరుతున్నారని తెలిపారు.వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు.

భవిష్యత్ లో రాష్ట్ర మంత్రి పువ్వాడ నాయకత్వంలో అండ గా ఉంటామని వెల్లడించారు.కాగా టి ఆర్వికెఎస్ లో చేరిన వారిలో వి.

వీరబాబు,ఎస్.రామారావు,పుల్లారావు,వెంకట రెడ్డి,సతీష్,బి.

బాబు,రమేష్,రాంబాబు ఉన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బి.వి.ఎస్ మూర్తి,జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బి.సత్యనారాయణ, యూ.శ్రీనివాస్, కార్యనిర్వాహక అద్యక్షులు ఎం.శ్రీనివాస్,ఖమ్మం టౌన్,డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు బి.ఉపేందర్,జి.రమేష్,రూరల్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్,ఆర్.కోటేశ్వరరావు సభ్యులు భాస్కర్ ,బి.శేషగరిరావు,పి.ఆనందరావు,కే.

నాగేశ్వర్రావు,ఎస్.కె.షరీఫ్, కె.నరసింహారావు,పి.లింగాచారి,బి.వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube