జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదలయ్యాయి.ఐఐటీ బాంబే జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 ఫలితాలను విడుదల చేసింది.
విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://result.jeeadv.ac.in/ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చని తెలిపింది.
విద్యార్థులు రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి రిజల్ట్స్‌ను చెక్ చేసుకోవచ్చు.దీని ద్వారా స్కోర్ కార్డును, ర్యాంక్‌లను చూసుకోవచ్చు.జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలతో పాటు మెరిట్ లిస్ట్‌తో పాటు ఎగ్జామ్ ఫైనల్ ఆన్సర్ కీని కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
దేశంలోని ఐఐటీల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను పరీక్షను నిర్వహించారు.గత నెల 28న జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పరీక్షను ఐఐటీ బాంబే నిర్వహించింది.