ఒకప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ వేరేలా ఉండేది.ఒక్కో హీరో ఒక్కో జోనర్ ను ఎంచుకుని సినిమాలు చేసేవారు.
దీంతో ఎవ్వరికి అంతగా ప్రాబ్లెమ్ ఉండేది కాదు.కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.
ఏ హీరో ఏ జోనర్ సినిమా చేస్తున్నాడో అర్ధం కావడం లేదు.యాక్షన్, రొమాన్స్, కామెడీ ఇలా ప్రతీ జోనర్ ను ప్రతి ఒక్క హీరో టచ్ చేస్తున్నాడు.
ఇది వరకు ఎవరైనా కొత్త జోనర్ ట్రై చేస్తే వారిని ప్రేక్షకులు రిజక్ట్ చేసేవారు.కానీ ఇప్పుడు అలా కాదు.
ప్రేక్షకులే హీరోల నుండి కొత్తదనం ఆశిస్తున్నారు.ఒక్కో సినిమాకు ఒక్కో రకం కోరుకుంటున్నారు.
ఒకే జోనర్ లో సినిమాలు చేస్తే ప్రేక్షకులకు నచ్చడం లేదు.దీంతో యంగ్ హీరోలకు పెద్ద సమస్య అయ్యింది.
యంగ్ హీరోలు ఎంత జాగ్రత్తలు తీసుకుని కొత్త రకం ట్రై చేస్తున్న వారిని ప్రేక్షకులు రిజక్ట్ చేయడంతో ప్లాపుల నుండి బయట పడలేక పోతున్నారు.ఒక హిట్ వస్తే వరుసగా ప్లాప్స్ వస్తున్నాయి.
నాని మన టాలీవుడ్ లో సినిమా సినిమాకు కొత్తగా ట్రై చేస్తున్నాడు.అయితే ఈయనకు కూడా ఈ మధ్య కలిసి రావడం లేదు.
ఒక్క హిట్ వస్తే వరుస ప్లాప్స్ వస్తున్నాయి.
ఇక మన టాలీవుడ్ లో మరొక మంచి నటుడు శర్వానంద్ పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది.ఈయన చేసిన అరడజను సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి.జోనర్స్ మార్చుకుంటూ వస్తున్న ఈయనకు ఇదే పరిస్థితి ఎదురవుతుంది.
అలాగే నితిన్ కు కూడా ప్లాపులు తప్పడం లేదు.నాగ శౌర్య, విజయ్ దేవరకొండ కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు.
వీరికి కూడా వరుస ప్లాపులే పలకరిస్తున్నాయి.దీంతో ఆడియెన్స్ ను ఏ జోనర్ లో మెప్పించాలో అర్ధం అవ్వక తలలు పట్టుకుంటున్నారు యంగ్ హీరోలు.