మామూలుగా ఎవరైనా ఏదైనా హోదాలో ఉంటే కచ్చితంగా వాటికి కొన్ని కండిషన్స్ ఉంటాయి.అది వ్యక్తిగత జీవితంలోనైనా సరే బయట విషయంలోనైనా సరే.
ఇక అలాంటి కండిషన్స్ సామాన్యులకే కాకుండా సెలబ్రెటీలకు కూడా ఉంటుంటాయి.అలా అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి కూడా గతంలో తన అత్త ఒక కండిషన్స్ పెట్టిందట.
ఇంతకు ఆ కండిషన్స్ ఏంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా నిలిచి ఓ రేంజ్ లో దూసుకుపోతున్న అల్లు అర్జున్ గురించి అందరికీ తెలిసిందే.
గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ కు ఈ సినిమా మంచి గుర్తింపు అందించింది.తొలి నటనతోనే మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ తర్వాత మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో స్టార్ గా ఎదిగాడు.
ఇటీవలే పాన్ ఇండియా మూవీ పుష్ప తో పాన్ ఇండియా స్టార్ గా కూడా ఎదిగాడు.
ఇక ఇదంతా పక్కన పెడితే ఈయన మంచి స్టార్ హోదాలో ఉన్న సమయంలో 2011లో స్నేహ రెడ్డి ని పెళ్లి చేసుకున్నాడు.
వీరికి ఒక కూతురు, ఒక కొడుకు కూడా ఉన్నారు.ఇక అల్లు అర్జున్ సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో.
కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాడు.తనకు సినిమాల సమయంలో కాస్త బ్రేక్ దొరికితే చాలు వెంటనే ఫ్యామిలీతో విదేశ ప్రయాణాలు చేస్తాడు.
కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతూ మంచి భర్తగా, మంచి తండ్రిగా నిలిచాడు.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్నేహ రెడ్డి, అల్లు అర్జున్ ల జంట క్యూట్ కపుల్ గా నిలిచింది.ఇప్పటికీ ఈ జంట ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా కనిపిస్తుంటారు.ఇక అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా తెలుగు ప్రజలతో మంచి పరిచయం పెంచుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఈమె కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం తో విపరీతమైన అభిమానులను సంపాదించుకుంది.అంతేకాకుండా సోషల్ మీడియా కు సంబంధించిన సర్వేలో స్నేహ రెడ్డి మొదటి స్థానంలో నిలిచింది.
ఏ స్టార్ హీరోల భార్యలు, స్టార్ హీరోయిన్ లు కూడా అందుకొని గుర్తింపును సొంతం చేసుకుంది.
తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటుంది.
అంతేకాకుండా అల్లు అర్జున్ కి సంబంధించిన సినిమా అప్ డేట్ లను, ఫోటోలను, పిల్లలతో సరదాగా ఆడుతున్న వీడియోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.మొత్తానికి అల్లు అర్జున్ కుటుంబం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి అభిమాన కుటుంబంగా అభిమానులకు దగ్గరయింది.
ఇదిలా ఉంటే తాజాగా స్నేహ రెడ్డికి తన అత్తయ్య పెళ్లి సమయంలో ఒక కండిషన్ పెట్టిందట.ఇంతకు ఆ కండిషన్ ఏంటంటే.అల్లు అర్జున్ తల్లి నిర్మల కోడలు స్నేహారెడ్డితో తనకు మాటివ్వాలని అన్నదట.ఇంతకు అదేంటంటే.వీలైనంత త్వరగా పిల్లల్ని కనాలని.ఎలాంటి కాల పరిమితులు పెట్టుకోకుండా మనవడో, మానవరాలినో కనివ్వాలని గట్టిగా అన్నారట.
మోడరన్ సొసైటీలో పుట్టి పెరిగిన స్నేహారెడ్డి పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనడానికి ఇష్టపడదని నిర్మల భయపడటంతో.కోడలికి ఆ కండీషన్ పెట్టారట.దీంతో అత్త కోరికను నెరవేరుస్తూ స్నేహారెడ్డి 2014లో అయాన్ కి, 2016లో అర్హకు జన్మనిచ్చిందట.మొత్తానికి అత్త మాటలకు గౌరవం వచ్చింది స్నేహారెడ్డి.