కన్నడ భామ రష్మిక మందన్న ఇప్పుడంటే స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తుంది కానీ తన కాలేజ్ డేస్ లో అందరి అమ్మాయిల్లానే తను కూడా సరదాగా ఉన్నానని అంటుంది.ఇప్పుడు వచ్చిన స్టార్ క్రేజ్ వల్ల అందరిలో మాములుగా ఉండటం కుదరదు.
ఇక వినాయక చవితి సందర్భంగా తన పాత్ర జ్ఞాపకాలను పంచుకుంది కన్నడ బ్యూటీ.కాలేజ్ డేస్ లో గణేష్ ఉత్సవాలని ఘనంగా జరుపుకున్నామని అంటుంది రష్మిక.
అంతేకాదు తమ బ్యాచ్ తో కలిసి చందాలు కూడా వసూళు చేసే వాళ్లమని. రంగు రంగు కాగితాలతో డెకరేట్ చేసే వాళ్లమని అంటుంది రష్మిక.కాలేజ్ డేస్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలని ఎంతో ఘనంగా జరుపుకున్నామని చెబుతుంది రష్మిక మందన్న.ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్ గా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన రష్మిక తన కాలేజ్ డేస్ లో గణేష్ ఉత్సవాల గుఇరించి ఫ్యాన్స్ తో పంచుకుంది.
ఇక అమ్మడి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ వారసుడు సినిమాలో నటిస్తున్న రష్మిక ఈ సినిమా తర్వాత మరో రెండు స్టార్ సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుందని టాక్.ఆల్రెడీ బాలీవుడ్ లో అమ్మడికి రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి.అవి హిట్ అయితే అక్కడ కూడా మరిన్ని ఛాన్సులు వస్తాయని తెలుస్తుంది.