వ్యవసాయం అంటే చాలా కష్టంతో కూడుకున్నది.ఎండ,వాన, చలి అనకుండా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది.
మండుటెండలో పనిచేయాల్సి ఉంటుంది.ఇక పంటకు పెట్టుబడి కూడా చాలానే పెట్టాల్సి ఉంటుంది.
ఇక అధిక వర్షాలు, వరదలతో పాటు పరుగులు, వైరస్ వల్ల పంటకు నష్టలం జరుగుతూ ఉంటుంది.ఇక ఎరువులు, క్రిమిసంహారక మండులకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది.
ఇక వ్యవసాయం చేయాలంటే చాలా పనిముట్లు అవసరం ఉంటుంది.ట్రాక్టర్ తో పాటు వ్యవసాయం చేయడానికి చాలా పనిముట్లు కావాలి.
కానీ వీటిని కొనాలంటే లక్షల్లో ఖర్చు అవుతూ ఉంటటుంది.దాంతో వీటిని రైతులు అద్దెకు తెచ్చుకుని వాడుకుంటారు.
వీటికి కూడా చాలా ఖర్చు అవుతూ ఉంటుంది.
అయితే కేంద్ర ప్రభుత్వం కీలక పథకం ప్రవేశపెట్టింది.
అద్దెకు వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు కస్టమ్ హైరింగ్ కేంద్రాలను నియమించనుంది.ఈ సెంటర్ల ద్వారా అతి తక్కువధరకే వ్యవసాయ పనిముట్లను కేంద్రం అద్దెకు ఇవ్వనుంది.
స్వల్ప మొత్తం చెల్లించి వీటిని అద్దెకు ఇవ్వనున్నారు.జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ నిధుల ద్వారా వీటిని ఏర్పాటు చేయనుంది.
తెలంగాణలో ఇప్పటికే 31 కస్టమర్ హైరింగ్ కేంద్రాలను మోదీ ప్రభుత్వం మంజూరు చేసింది.29 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయగా.ఒక్కో సెంటర్ కోసం రూ.22 లక్షల నిధులు కేటాయించారు.ఈ నిధుల కోసం వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేసి రైతులకు అద్దెకు ఇవ్వనున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ మినహా మిగతా జిల్లాలో ఒక మండలం చొప్పున ఫైలెజ్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు.తర్వాత అన్ని మండలాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు.మహిళా సంఘాల్లోని మహిళా సభ్యులకు ఈ కస్టమ్ హైరింగ్ కేంద్రాల బాధ్యతలను అప్పగించనున్నారు.
సన్న, చిన్నకారు రైతులకు కొంత తక్కువ ధరకు, మహిళా సంఘాల సభ్యులుగా ఉన్న రేతలుకు మార్కెట్ ధరలో 50 శాతానికి అద్దెకు ఇవ్వనున్నారు.
ట్రాక్టర్, కల్టివేటర్, పవర్ వీడర్, పవర్ టిల్లర్, పవర్ స్ర్పేయర్లు, సోయింగ్ అండ్ ఫెర్టిలైజర్, డ్రిల్లర్, ట్రాక్టర్ ఆపరేటర్ తో పాటు ఇతర పనిముట్లు ఇందులో ఉండనున్నాయి.