జగన్ వద్దన్నా ... టీడీపీ తో పొత్తుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ ? 

ఏపీలోనూ , కేంద్రంలోనూ కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.ముఖ్యంగా 2024 ఎన్నికలే టార్గెట్ గా కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి.

 Bjp Green Signal For Alliance With Tdp Even If Jagan Doesn T Want It , Tdp, Bjp,-TeluguStop.com

మొన్నటి వరకు ఏపీలో టిడిపిని తీవ్రంగా వ్యతిరేకించిన కేంద్ర అధికార పార్టీ బిజెపి ఇప్పుడు ఆ విషయంలో తన మనసు మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది.ఈ మేరకు ఎన్డీఏలో టిడిపిని చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఈ సందర్భంగా పొత్తు అంశంపై ప్రాథమికంగా బిజెపి కీలక నాయకులతో చర్చి జరిగినట్లు సమాచారం.అలాగే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రహస్యంగా కలిసినట్లు, ఈ సందర్భంగా టిడిపి ఎన్డీఏలు చేరిక అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం.

వాస్తవంగా ఎప్పటి నుంచో బిజెపితో పొత్తు పెట్టుకోవాలని టిడిపి ప్రయత్నాలు చేస్తూ ఉంది.
  ఏపీలో బిజెపి బలం అంతంత మాత్రంగానే ఉన్నా,  కేంద్రంలో మళ్లీ బిజెపి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండడంతో పాటు, ఎన్నికల సమయంలో తమకు అన్ని రకాలుగా ఆలోచనతో బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి ప్రయత్నాలు చేస్తూనే వస్తుంది.

దీనిపై తాజాగా బిజెపి అగ్ర నేతలు సర్వే చేయించినట్లు సమాచారం.బిజెపితో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీకి పెద్దగా కలిసివచ్చేదేమీ లేదని,  కానీ పార్లమెంట్ ఓట్లు భారీగా పెరుగుతాయని నివేదికలు అందడంతో టిడిపిని ఎన్డీఏలో చేర్చుకుంటే తమకు ఎటువంటి ఇబ్బందులు ఉండవనే ఆలోచనలో బిజెపి అగ్ర నాయకులు ఉన్నారట.

ఇప్పటికే ఎన్డీఏ నుంచి ఒక్కో పార్టీ దూరం అవుతూ వస్తోంది.దీంతో రాబోయే ఎన్నికల ఫలితాల తరువాత తమకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా బిజెపి ఇప్పటి నుంచే తమకు కలిసి వచ్చే అన్ని పార్టీలను దగ్గర చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంది.
 

Telugu Aliance, Amith Sha, Ap, Central Bjp, Janasena, Narendra Modi, Tdp Bjp Ali

దీనిలో భాగంగానే టిడిపి విషయంలో తమ వైఖరిని మార్చుకున్నట్లు సమాచారం.అయితే ఈ విషయంపై ఏపీ సీఎం జగన్ కు ప్రాథమిక సమాచారం ఉందట.కొద్దిరోజుల క్రితం హుటాహుటిన జగన్ ఢిల్లీకి వెళ్లడానికి కారణం ఇదేనని తెలుస్తోంది.ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ లో టిడిపిని చేర్చుకోవద్దని జగన్ బిజెపి అధిష్టానం పై ఒత్తిడి పెంచినట్లు సమాచారం.

అయినా బిజెపి ఈ విషయంలో జగన్ మాటను పట్టించుకోలేదట.దీనికి సంబంధించి త్వరలోనే కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తుంది.అదే జరిగితే ఏపీలో టిడిపి కి రాజకీయంగా ఇబ్బందులు తొలిగినట్లే. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube