తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ వరంగల్ జిల్లా హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరిగింది.ఈ సభలో బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఇక ఇదే సమయంలో సెప్టెంబర్ 12 వ తారీకు నుండి నాలుగో విడత “ప్రజాసంగ్రామ” యాత్ర చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
మూడో విడత యాత్రను అడ్డుకున్న కేసీఆర్ దమ్ముంటే.
నాలుగో విడత యాత్రను ఆపు చూడు.అందువల్లే ముందుగానే తేదీని ప్రకటిస్తున్న అని బండి సంజయ్ సవాల్ విసిరారు.
అయితే ఎక్కడి నుంచి యాత్ర మొదలు పెడుతున్నది అన్నది ఆయన వెల్లడించలేదు. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బాటలోనే నడుస్తూ నయా నిజాంలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.