ప్రయాణికులకు బంపర్ ఆఫర్... రూ.9కే ఫ్లైట్ టికెట్.. ఈరోజే లాస్ట్, త్వరపడండి!

అవును… మీరు విన్నది అక్షరాలా నిజం.రూ.9కే ఫ్లైట్ టికెట్ పొందే అద్భుత అవకాశాన్ని నేడే సొంతం చేసుకోండి.ఈరోజుల్లో బేసిగ్గా 10 రూపాయలు పెట్టనిదే కనీసం ఛాయ్ కూడా దొరకదు.అలాంటిది ఓ విమానయాన సంస్థ ప్రయాణికులకు కేవలం రూ.9కే ఫ్లైట్ టికెట్ పొందే అద్భుత అవకాశాన్ని ఇస్తోందంటే ఇదొక అరుదైన అవకాశంగా మనం భావించాలి.రూ.9కే భారత్ నుంచి వియత్నాం వెళ్లేందుకు టికెట్‌ను అందిస్తోంది.కానీ ఇక్కడ వచ్చిన చిక్కేంటి అంటే.ఈ ఆఫర్‌కు కౌంట్ డౌన్ మొదలైంది.

 Bumper Offer For Passengers Flight Ticket For Rs. 9.. Lost Today , Hurry Up, 9r-TeluguStop.com

ఈరోజే (ఆగస్ట్ 26) ఈ ఆఫర్‌కు లాస్ట్ డేట్.ఓసారి పూర్తి వివరాల్లోకి వెళితే… వియత్నాం‌కు చెందిన VietJet ఎయిర్‌లైన్స్ ఈ బంపర్ ఆఫర్‌ను ప్రజలకు ముందుకు తీసుకొచ్చింది.కేవలం రూ.9కే(ఎయిర్ పోర్ట్ టాక్స్, సర్‌ఛార్జీలు అదనం) టికెట్ అందిస్తూ.ఇండియా నుంచి వియత్నాంకు ప్రయాణించేందుకు వీలు కల్పిస్తోంది.కొద్ది రోజుల క్రితమే ఆఫర్ ప్రారంభం కాగా.నేటితో దీనికి ఎండ్ కార్డు పడనుంది.ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు.

ఆగస్ట్ 15- మార్చి 23, 2023 మధ్య ప్రయాణం చేయొచ్చని వెల్లడించింది.

హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్‌తోపాటు మరో 13 రూట్ల నుంచి వియత్నాంలోని హనోయ్, హో చిన్ మిన్ సిటీ, డా నాంగ్, ఫూ క్యోక్ నగరాలకు వెళ్లే వారికి ఈ రేటు వర్తించనుంది.

అంతేకాకుండా ఈ ఆఫర్ పొందాలంటే.కేవలం బుధ, గురు, శుక్రవారాల్లో మాత్రమే టికెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.ఈ ఆఫర్ ద్వారా ప్రమోషనల్ టికెట్స్ రూపంలో కేవలం 30వేల టికెట్లను మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పింది.అందువల్ల.

వియత్నాం వెళ్లాలనే ప్లాన్‌లో ఉన్న వారెవరైనా ఉంటే.https://www.vietjetair.com/en లేదా Vietjet Air అప్లికేషన్ ద్వారా లాగిన్ అయి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube