తెలంగాణ వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.గడిచిన వారం రోజుల్లో డెంగీ, ఎండెమిక్ స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు.
ముఖ్యంగా చిన్నారుల్లోనే డెంగీ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది.టైఫాయిడ్ కేసులు కూడా పెరిగాయి.
సాధారణంగా వానకాలంలో డెంగీ కేసులు పెరుగుతుంటాయి.అయితే ఈ సారి స్వైన్ ఫ్లూ కేసులు పెరిగడం గమనార్హం.
గతంతో స్వైన్ ఫ్లూ కేసులు వెలుగు చూసినప్పుడు పదుల సంఖ్యలో మరణాలు కూడా నమోదయ్యాయి.ఈ క్రమంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే మంత్రి హరీష్ రావు వైద్యశాఖను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే.
రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ ఫ్లై వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంటి ఆవరణలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.