బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.మొన్నటిదాకా అక్షయ్ కుమార్ ఏ సినిమా తీసినా సూపర్ హిట్ అయ్యేది కానీ ఇప్పుడు అక్షయ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి.
ఈ క్రమంలో అక్షయ్ కుమార్ ఓ క్రేజీ డెశిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.సినిమా నిర్మాణం లో హీరోల రెమ్యునరేషన్ ఎక్కువ శాతం ఉంటుందని అందుకే తన రెమ్యునరేషన్ ని తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నారట.
మాములుగా అయితే సినిమాకి 80 నుంచి 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకునే అక్షయ్ కుమార్ ఇక మీదట తన రెమ్యునరేషన్ 20 కోట్లు ఇస్తే చాలు అంటున్నాడట.అయితే సినిమా సూపర్ హిట్టైతే ఆ లాభాల్లోంచి తిరిగి ఎంతో కొంత రెమ్యునరేషన్ గా తీసుకుంటానని చెబుతున్నారట.
అక్షయ్ కుమార్ నిర్మాతగా కూడా వ్యవహిస్తున్న కారణంగా నిర్మాతల గురించి ఆలోచించి ఈ డెశిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.అక్షయ్ లానే అందరు హీరోలు రెమ్యునరేషన్ తగ్గిస్తే సినిమా బడ్జెట్ చాలా వరకు కంట్రోల్ అవుతుందని చెప్పొచ్చు.
మరి అక్షయ్ దారిలోనే మిగతా హీరోలు కూడా తమ రెమ్యునరేషన్ తగ్గిస్తారా లేదా అన్నది చూడాలి.ఇప్పటికే టాలీవుడ్ లో స్టార్ హీరోల రెమ్యునరేషన్ గురిచి ప్రొడ్యూసర్ గిల్డ్ కూడా చర్చలు నిర్వహించిన విషయం తెలిసిందే.