ఏ దేశానికైనా సరే కొన్ని నియమ నిభందనలు ఉంటాయి, ఇతర దేశస్తులు కానీ, స్థానికులు కానీ ఆ దేశ నిభందనలకు విరుద్దంగా నడుచుకుంటే తప్పనిసరిగా వారు శిక్షార్హులే.అయితే చాలా దేశాలు ఈ నిభంధనలను కటినంగా అమలు చేయవు.
చాలా దేశాలలో ఇలాంటి నిభందనలు ఎన్నో ఉన్నా వాటిని పాటించే వారు కానీ పాటించని వారిపై శిక్షలు అమలు చేసే వారు కానీ చాలా అరుదు.అయితే భాద్యతారహితంగా ఉన్న ఓ వ్యక్తి తమ దేశాన్ని విడిచి విదేశాలకు వెళ్తే తప్పనిసరిగా అక్కడి నిభంధనలను పాటించి తీరాల్సిందే.
లేకపోతే ఈ ప్రవాసుడుకి పట్టినగతే పడుతుంది.వివరాలలోకి వెళ్తే.
కువైట్ దేశం తమ దేశ అభివృద్ధిలో భాగంగా ఎన్నో కటినమైన నిభందనలు ఏర్పాటు చేసుకుంది.ఇందులో భాగంగా చిన్న చిన్న తప్పులు చేసినా సరే వాటిపై శిక్షను అనుభవించి తీరాల్సిందే.
ఈ శిక్షల అమలులో వాళ్ళు రాజీ పడే ఛాన్స్ లేదు.తప్పు చేస్తే ఎంతటి వారైనా సరే ప్రభుత్వం విధించే శిక్షలను స్వీకరించాల్సిందే.అయితే ఈ విషయం తెలియని ప్రవాసుడు కువైట్ అత్యంత సీరియస్ గా పరిగణించే నిభందననే తుంగలోకి తొక్కేసాడు.
ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ఎలాంటి దృశ్యాన్ని అయినా భందించి వెంటనే సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం పరిపాటే.
చాలా దేశాలలో ప్రజలు ఈ విషయంలో ఏ మాత్రం ఆలోచన చేయరు.చివరికి ఒక వ్యక్తి ప్రాణాలు పోతున్నా సరే వీడియో లో లైవ్ లు పెడుతారు కానీ వారిని రక్షించే ప్రయత్నం మాత్రం చేయరు.
అయితే ఈ విషయంలో కువైట్ చాలా సీరియస్ గా ఉంటుంది.కువైట్ లో ఎలాంటి ప్రమాద ఘటనలు జరిగినా సాయం చేయకపోగా వీడియో తీసి సోషల్ మీడియాలో భంధించే వారిపై కువైట్ ఉక్కుపాదం మోపేలా చర్యలు తీసుకుంటోంది కువైట్ లోని ఓ రింగ్ రోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి కొందరు మృతి చెందిన ఘటనలో ఓ ప్రవాసుడు ఈ వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఇలాంటి ఘటనలు జరిగినపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కువైట్ రూల్స్ ప్రకారం నేరం దాంతో ఈ విషయం పోలీసులకు తెలియడంతో అతడికి నోటీసులు పంపిన పోలీసులు త్వరలో అరెస్ట్ చేసి కటినమైన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.
.