అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇన్‌స్టాకార్ట్‌కు వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తోన్న భారత సంతతికి చెందిన అపూర్వ మెహతా సంచలన నిర్ణయం తీసుకున్నారు.దశాబ్ధం క్రితం తాను స్థాపించిన ఆన్‌లైన్ కిరాణా డెలివరీ సేవల సంస్థ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఇన్‌స్టాకార్ట్ పబ్లిక్ కంపెనీగా మారడం, బోర్డు నుంచి మెహతా తప్పుకున్నందున సీఈవో ఫిడ్జీ సిమో.బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు చైర్‌గా నియమితులైనట్లు ఇన్‌స్టాకార్ట్ ప్రకటించింది.గతంలో ఫేస్‌బుక్ మాజీ ఎగ్జిక్యూటివ్‌గా సిమో విధులు నిర్వర్తించారు.
సీఈవో, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తాను ఒక కొత్త మిషన్‌ను కొనసాగించాలని భావించినట్లు మెహతా శుక్రవారం ట్వీట్ చేశారు.
అటు గడిచిన దశాబ్ధం కాలంగా ఇన్‌స్టాకార్ట్ అభివృద్ధి కోసం అపూర్వ మెహతా ఎంతో కృషి చేశారని సిమో ప్రశంసించారు.గ్రాసరీ ఇండస్ట్రీ రూపు రేఖలను సమూలంగా మార్చేసేలా అపూర్వ మెహతా ఇన్‌స్టాకార్ట్‌ను స్థాపించారని బోర్డు సభ్యుడు జెఫ్ జోర్డాన్ కొనియాడారు.
ఆయన అంకిత భావం ఇన్‌స్టాకార్ట్‌ను మిలియన్ల మంది కస్టమర్ల అభిమానం పొందేలా చేసిందన్నారు.
ఇన్‌స్టాకార్ట్ .ఉత్తర అమెరికాలో 5,500కు పైగా నగరాల్లో 70,000 స్టోర్‌ల నుంచి ఆన్‌లైన్ షాపింగ్, డెలివరీ, పికప్ సేవలను సులభతరం చేసే ఉద్ధేశంతో స్థాపించబడింది.ఇన్‌స్టాకార్ట్‌లో 800కు పైగా జాతీయ, ప్రాంతీయ రిటైల్ బ్రాండ్‌లు భాగస్వాములుగా వున్నాయి.
అమెరికాలో 85 శాతం మంది, కెనడాలో 90 శాతం మంది ఇన్‌స్టాకార్ట్‌ను ఉపయోగిస్తున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి.