విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ మూవీ కి సంబంధించి ఇప్పటికే ఇండస్ట్రీలో బజ్ మొదలైంది అన్న విషయం తెలిసిందే.ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని అటు రౌడీ హీరో అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ సినిమా పై మరింత అంచనాలు పెంచేసింది.ఇకపోతే ఇటీవల ఎంతో గ్రాండ్గా ట్రైలర్ లాంచ్ కూడా చేశారు అన్న విషయం తెలిసిందే.
ఇక ట్రైలర్ లాంచ్లో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ డెలివరీ యాక్షన్ సన్నివేశాలు అందరిని కూడా మంత్రముగ్ధుల్ని చేశాయ్.దీంతో ఈ సినిమా విడుదల పై మరింత ఆసక్తి పెరిగిపోయింది.కాగా ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు.
అయితే ఇటీవలే విడుదలైన ట్రైలర్ లో విజయ్ దేవరకొండ తో పాటు బాక్సింగ్ పోటీకి సిద్దమైన ఓ యువకుడు అందరి దృష్టిని ఆకర్షించాడు.అతను ఎవరో అని వెతకడం ప్రారంభించారు నెటిజన్లు.
అతని పేరు విషు రెడ్డి. ఇంతకుముందు మహబూబా, త్రయం, ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా నటించాడు.ఇప్పుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమాలో ఎం ఎం ఏ ఫైటర్ గా కనిపించబోతున్నాడు విష్ణు రెడ్డి.విషు రెడ్డి పూరి జగన్నాథ్ చార్మి కలిసి నిర్వహిస్తున్న పూరి కనెక్ట్ నిర్మాణ సంస్థకు సీఈవోగా కూడా వ్యవహరిస్తున్నాడు అని చెప్పాలి.
విజయ్ దేవరకొండ మాదిరిగానే విషు రెడ్డి కూడా చాలానే ఈ సినిమా కోసం కష్టపడ్డాడూ.బాడీ పెంచడానికి.ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇతని పాత్ర లైగర్ సినిమాలో ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.