గుండె మార్పిడి చేస్తున్నారు.. మెదడు మార్పిడి చేయలేరా?

ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగం ఏరకంగా అభివృద్ధి చెందిందో చెప్పాల్సిన పనిలేదు.కొంతమంది వైద్యులు సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నారు.

 Transplanting The Heart Cant Transplant The Brain Details, Brain Change, Viral L-TeluguStop.com

ఒకప్పుడు గుండె మార్పిడి అంటే అది సాధ్యమయ్యే పనికాదు.కానీ నేటి పరిస్థితులలో గుండె మార్పిడి విధానాన్ని చాలా సక్సెస్ ఫుల్ గా చేస్తున్నారు.

ఇది మామ్మూలు విషయం కాదు.మనిషి పురోగతి సాధించిన వాటిలో ఇది ఒకటి.

అయితే కొన్ని కొన్ని సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం కనుగొనలేదు.ఇదిలా ఉంచితే మెదడు మార్పిడి విషయంలో నేడు అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి.

అసలు మెదడు మార్పిడి చేయడం అనేది జరుగుతుందా లేదా అనే విషయం ఒకసారి చూద్దాం.

మనకు దొరికిన సమాచారం మేరకు, ఒక కోతి తలను మరో కోతి శరీరానికి అతికించి EEG (ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ బ్రెయిన్) రీడింగ్స్ చూస్తే, ఆ తల బాగానే పని చేసిందని పరీక్షలో తేలింది.

ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ బ్రెయిన్ లో మార్పులనీ ఫంక్షన్ నీ తెలియజేయడంలో సక్సెస్ అయిందన్నమాట.మూర్ఛ రోగాన్ని, ఆ పై బ్రెయిన్ లో మార్పులు గురించి కూడా తెలిసింది.

అయితే సదరు తలని అమర్చిన తరువాత కూడా ఆ కోతి బ్రతకలేదనేది సుస్పష్టం అయింది.దానికి కారణం… శరీరంలో ఫారిన్ బాడీ యాంటిజెన్ లు శరీర ధర్మాన్ని మార్చకుండా ఇమ్మ్యూనోలోజి అనేది అడ్డుపడుతుంది కాబట్టి.

Telugu Brain, Brain Change, Heart, Monkeybrain, Monkey, System, Research, Latest

ఈ క్రమంలో బ్రెయిన్ లో కొంత టిష్యూని మార్చడం, న్యూరాన్స్ ని కొత్తగా ప్రవేశ పెట్టడం లాంటివి ట్రై చేస్తున్నారు గాని, ఇంత వరకు అవి విజయం సాధించిన దాఖలాలు లేవు.మనిషి మెదడు వెన్నుముక ద్వారా మొత్తం నెర్వస్ సిస్టెంకి లింక్ చేసి ఉంటుంది.దీనిలోనే అనలైజింగ్, రిసీవింగ్, మెమరీ వంటి ఫంక్షన్స్ అనేవి ఉంటాయన్న సంగతి విదితమే.అందుకే మనిషి మెదడులోని అత్యంత కీలకమైన నరాల వ్యవస్థను మిగిలిన వ్యవస్థలతో లింక్ చేయడంలో డాక్ట్రర్లు విజయం సాధించలేదు.

అయితే రానున్న కాలంలో ఎలాగన్న దీనిపైన విజయం సాధిస్తామని డాక్టర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube