పిల్లులకు, ఎలుకలకు మీసాలు ఎందుకుంటాయో తెలుసా?

మనుషులలో మగవారికి మీసాలు వున్నట్టే కొన్ని జంతువులలో అటువంటి మీసాలను మనం గమనించవచ్చు.ముఖ్యంగా పిల్లులను, ఎలుకలను, కుక్కలను చూసినట్లయితే వాటికి మనిషికి మల్లే మీసాలు ఉంటాయి.

 Do You Know Why Cats And Mice Have Whiskers , Cats,rats, Reason, Viral Latest, N-TeluguStop.com

మిగిలిన వెంట్రుకల కంటే కూడా అవి 3 రేట్లు బలంగా ఉంటాయట.ఓసారి బయాలజీలోకి వెళితే, ఈ వెంట్రుకల చివరన మిగిలిన వెంట్రుకుల మాదిరిగా కాకుండా, నాడుల కలయిక ఉంటుంది.

వీటిని ‘విబ్రిసే’ అని పిలుస్తారు.వాస్తవానికి లాటిన్ లో “విబ్రియో” అంటే కదలటం అని అర్ధం.

అయితే ఇవి వాటి అంతట వాటిగా సమాచారాన్ని ఇవ్వడం కుదరదట.ఏ గాలికో, ధూళికో మరేదైనా కారణంతో తగలటం వంటివి జరగడంతో మాత్రమే వాటిలో స్పందన వచ్చి మెదడుకి సమాచారాన్ని పంపిస్తాయి.

ఇలాంటి వాటిని “ప్రోప్రియో రిసెప్టార్” అని పిలుస్తారు.మిగతా వెంట్రుకల మాదిరి వీటిని కట్ చేయకూడదు.చీకట్లో అవి వెళ్ళే సమయంలో గాని ఇరుకైన ప్రదేశాల్లో గాని వెళ్ళే సమయంలో వాటికి ఈ వెంట్రుకల నుంచే ఒక అంచనా అనేది అందుతుంది.గాలి వేగాన్ని,గాలిలో ఉండే ఒత్తిడిని ఇవి పసిగట్టి, ముందున్న ప్రాంతాన్ని అంచనా వేస్తాయి.

ఆ ప్రాంతానికి తగిన విధంగా తమ శరీరాన్ని మారుస్తాయి.

అయితే కొన్నిసార్లు ఈ మీసాలకు, ఏదైనా తగిలితే గనుక కనురెప్పలు వెంటనే మూసుకుపోతూ వుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఎందుకంటే వాటి కళ్ళకు కూడా దీనితో భద్రత అనేది ఉంటుంది.ఉదాహరణకు పిల్లి ఏదైనా చిన్న రంద్రంలో నుంచి వెళ్తుందా లేదా అనేది వాటి నోటికి ఉండే మీసాల ద్వారా ఆ మార్గాన్ని అంచనా వేసుకుని వెళ్తుంది.

కొన్ని జంతువులకు ఇవి ముందు కాళ్ళ పై ఉంటాయి.ఇవి స్పర్శకు కూడా రియాక్ట్ అవుతాయి.ఉదాహరణకు మనకళ్ళమీద అంటే, ఫింగర్ టిప్స్ పైన వెంట్రుకలు వున్న మాదిరి అన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube