దివాలా తీసిన రఘురామ కంపెనీ ?

వైసిపి నరసాపురం ఎంపీ విజయసాయిరెడ్డి చాలా కాలంగా ఏదో ఒక అంశంతో వార్తల్లోనే ఉంటున్నారు.ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఆయన అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

 Bankrupt Raghurama Company-TeluguStop.com

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఆయన కోర్టులో పిటిషన్ వేస్తూ జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.అయితే అనూహ్యంగా ఆయన చిక్కుల్లో పడ్డారు.

ఆయనకు చెందిన కంపెనీ ఇంద్ భారత్ మహారాష్ట్ర కంపెనీ దివాళా తీసినట్లు గా నేషనల్ లా ట్రిబ్యునల్ ప్రకటించింది.వెంటనే దివాలా ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది.

దీంతో రగురమ వ్యవహారం ఒక్కసారిగా సంచలనంగా మారింది.ఆయనకు ఏపీ మినహా చాలా రాష్ట్రాల్లో వివిధ కంపెనీలు ఉన్నాయి.

వాటి పరిస్థితి దాదాపు ఇదే విధంగా ఉందనేది చాలా కాలం నుంచి వైసీపీ విమర్శలు చేస్తోంది.

అసలు మహారాష్ట్రలో ఇంద్ భారత్ మహారాష్ట్ర కంపెనీ దివాలా ప్రక్రియ వరకు వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ కంపెనీ మహారాష్ట్రలో విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టింది.

ఆ కంపెనీకి ఓ వ్యక్తి వరి పొట్టు సప్లై చేశాడు .దాని నిమిత్తం అతడికి భారీస్థాయిలో డబ్బులు చెల్లించాల్సి ఉంది.అయినా చాలాకాలంగా చెల్లించకపోవడంతో అతడు ఆ కంపెనీ ఆస్తులను అమ్మి తనకు డబ్బులు చెల్లించాలని, వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించాలని ఎన్సీ ఎల్టి ని ఆశ్రయించాడు.ఈ విషయంపై ఇంద్ భారత్ కంపెనీ కూడా పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై విచారణ జరిగిన అనంతరం కంపెనీ దివాలా ప్రక్రియను ప్రారంభించాలని ఎన్టీ ఎల్టి ఆదేశించింది.ఆ ఆదేశాల ప్రకారం చూస్తే .  కంపెనీ ఆస్తులు, అమ్మకాలపై నిషేధం ఉంటుంది.అలాగే దివాలా ప్రక్రియను ట్రిబ్యునల్ ఆధ్వర్యంలోనే పూర్తిచేస్తారు.

Telugu Ap Cm, Indhbarath, Jagan, Modhi, India, Vijayasai, Ysrcp-Politics

ఇదే విధంగా ఇంద్ భారత్ పేరుతో దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రఘురామ కంపెనీలను స్థాపించారు.ఈ విధంగా ఎనిమిది కి పైగా కంపెనీలు ఆయనకు ఉన్నాయి.అయితే అన్ని చోట్ల కార్యకలాపాలు కొనసాగుతున్నాయా అనే విషయంలోనూ అనేక అనుమానాలు ఉన్నాయి.ఆయా కంపెనీల పేరుతో భారీ స్థాయిలో రుణాలు తీసుకుని వాటిని దారి మళ్లించినట్లు అనేక విమర్శలు రఘురామ ఎదుర్కొంటున్నారు.

వీటిపై సీబీఐ కూడా కేసులు నమోదు చేసింది.వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అనేకమార్లు కేంద్రమంత్రులకు, ప్రధానికి, రాష్ట్రపతికి సైతం ఫిర్యాదు చేశారు.  ఇప్పుడు ఆ కంపెనీల్లో ఒకటి దివాలా తీయటంతో రఘురామ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube