వయసు పైబడటం, ఆహారపు అలవాట్లు, హార్మోన్ ఛేంజస్, పోషకాల కొరత, కాలుష్యం వంటి రకరకాల కారణాల వల్ల ముఖ చర్మం సాగిపోతూ ఉంటుంది.ఇది ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుంది.
దాంతో సాగిన చర్మాన్ని మళ్లీ టైటిగా మార్చుకోవడం కోసం నానా పాట్లు పడుతుంటారు.ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకుంటే, ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే.
చాలా సులభంగా చర్మాన్ని టైట్‌గా, గ్లోయింగ్‌గా మార్చుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ పాలు పోయాలి.పాలు కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
ఇలా ఉడికించుకున్న ఓట్స్ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన వెంటనే.మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని దాని నుంచి స్ట్రైనర్ సాయంతో జ్యూస్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్‌లో వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్, వన టేబుల్ స్పూన్ గ్లిజరిన్, రెండు టేబుల్ స్పూన్ల ఆల్మండ్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి.కాస్త డ్రై అవ్వనివ్వాలి.
ఆపై వేళ్లతో సున్నితంగా సర్కిలర్ మోషన్లో మసాజ్ చేసుకుంటూ వాటర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా ఉదయం, సాయంత్రం చేస్తే సాగిన చర్మం టైట్‌గా మారుతుంది.
మరియు ముఖం గ్లోయింగ్‌గా, ఆకర్షణీయంగా కూడా మారుతుంది.కాబట్టి, చర్మాన్ని టైట్‌గా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న వారు.
తప్పకుండా ఇప్పుడు చెప్పిన చిట్కాను ట్రై చేయండి.ఖచ్చితంగా మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.