వచ్చే ఎన్నికల్లో సింగిల్ గానే జనసేన పోటీ

వచ్చే ఎన్నికల్లో పొత్తుపై ఏపీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.సింగిల్ గానే పోటీచేస్తామని అధికార పార్టీఇప్పటికే ప్రకటించింది.

 Janasena Will Contest Single In The Coming Elections , Janasena , Janasena Will-TeluguStop.com

ప్రతిపక్షాలు కలిసి పోటీ చేస్తాయా? విడి విడిగా పోటీచేస్తాయా అన్న విషయంపైనే చర్చలు సాగుతున్నాయి.జనసేనతో కలిసి పోటీ చేయాలని గతంలో టీడీపీ భావించింది.

జనసేన బీజేపీ మధ్య స్నేహం నడుస్తోంది.ఈ పరిస్థితుల్లో పవన్ ప్రకటించిన మూడు ఆప్షన్షపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకుపైగా గడువు ఉంది.కాని చాలా కాలం క్ర్రితమే అక్కడ రాజకీయ వేడి రగులుకుంది.విపక్షాలన్నీ అధికార పార్టీ అసమర్థ విధానాలపై దండెత్తుతున్నాయి.వేటికవి విడివిడిగా ప్రజాందోళనలు నిర్వహిస్తున్నాయి.

గత ఎన్నికల్లో తెలుగుదేశానికి వ్యతిరేకంగా వైసీపీ, బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేయగా…వైసీపీ అధికారంలోకి వచ్చింది.ఎన్నికల తర్వాత బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది.

అయితే జనసేనతో కలిసుండాలని తెలుగుదేశం అప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది.కాని ఎన్నికల ముందు బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబుతో మళ్ళీ పొత్తుకు కమలనాథులు సుముఖంగా లేరు.

బీజేపీని వీడి జనసేన బయటకు వచ్చే అవకాశాలు లేవు.అందుకే కలిసి నడుద్దామని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నిసార్లు ప్రకటించినా జనసేనాని నుంచి సానుకూల స్పందన రాలేదు.

చివరికి వన్ సైడ్ లవ్ వల్ల ఉపయోగం లేదంటూ తన నిరాశను బహిరంగంగానే వెలిబుచ్చారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.జనసేన సమావేశంలో పొత్తుల గురించి పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు.వచ్చే ఎన్నికల్లో పొత్తులపై తమ వద్ద మూడు ఆప్షన్లు

Telugu Assembly Ap, Chandrababu, Janasena, Janasena Bjp, Pawan Kalyan-Political

ఉన్నట్లు ప్రకటించారాయన.టీడీపీని ఉద్దేశించి కూడా కామెంట్ చేశారు జనసేనాని.గతంలో వన్ సైడ్ లవ్ అన్న చంద్రబాబు ఇప్పుడు వార్ వన్ సైడ్ అంటున్నారని వ్యాఖ్యానించారు.జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదంటే జనసేన సింగిల్ గా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అని తన ఆప్షన్లను పవన్ వివరించారు.

ఈ సందర్భంగా…జనం కోసం తగ్గాలంటూ బైబిల్ లోని సూక్తిని పవన్ ప్రస్తావించారు.వార్ వన్ సైడ్ అంటున్న టీడీపీ ఈసారి కొంచెం తగ్గాలని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube