స్వస్తిక్ అంటే ఏమిటి? దీనిని మతంతో ఎందుకు ముడిపెడతారో తెలుసా?

స్వస్తిక్ గుర్తుకు హిందూ మతంలో ఎంతో ప్రాధానత్య ఉంది.దీనికి ఎంతో చరిత్ర కూడా ఉంది.

 Why Swastik Symbol Is So Important For Hindus , Swastik Symbol , Important For-TeluguStop.com

అయితే ఇది హిట్లర్ నాజీ సైన్యం జెండా బ్యాక్ గ్రౌండ్‌లోనూ కనిపిస్తుంది.దీనిని చూశాక హిందువుల మత చిహ్నంగా ఎలా మారిందనే ప్రశ్నకూడా తలెత్తుతుంది.

ఒక హాలీవుడ్ సినిమాలో హిట్లర్ నాజీ సైన్యం జండాపై ఈ గుర్తును చూపించారు.స్వస్తిక్ చిహ్నం బౌద్ధమతంలో కూడా కనిపిస్తుంది.

బౌద్ధమతంలో స్వస్తిక్ బుద్ధుని పాదముద్రలను సూచిస్తుందని చెబుతారు.జైనమతంలో కూడా స్వస్తిక్ గుర్తు కనిపిస్తుంది.

జైన శాఖలలో ఎరుపు, పసుపు, తెలుపు రంగులతో కూడిన స్వస్తిక్ చిహ్నాలు కనిపిస్తాయి. మెసొపొటేమియా నాగరికతలో ఈ గుర్తును నాణేలపై ఉపయోగించేవారు.

ఆఫ్రికా, ఆసియాలోని పురాతన కుండలపై కూడా ఈ గుర్తును కనుగొన్నారు.ఇది జర్మనీ, వైకింగ్ సంస్కృతులలో కూడా కనిపిస్తుంది.19వ శతాబ్దం చివరిలో, 20వ శతాబ్దం ప్రారంభంలో స్వస్తిక్ పాశ్చాత్య సంస్కృతిలో ఒక చిహ్నంగా కూడా గుర్తింపు పొందింది.

ఈ నేపధ్యంలోనే హిట్లర్ ఈ చిహ్నాన్ని ఎందుకు ఉపయోగించాడో వెల్లడయ్యింది.

ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి హిట్లర్ స్వస్తికను ఉపయోగించినప్పటికీ, ఇది హిందూ మతానికి సద్గుణ చిహ్నం.స్వస్తిక్ అనే పదం సు+అస్తిక్ నుండి వచ్చింది.అంటే మంచి చేసేవాడు.అసలు సంస్కృతంలో “శ్రేయస్సుకు అనుకూలమైనది” అని దీని అర్థం.

ఇది నాలుగు దిశలలోకి వెళ్లే లైన్లను కలిగి ఉంది.ఇవి కుడి వైపుకు తిరుగుతాయి.

స్వస్తిక్ చిహ్నం అనేది ఒక ప్లస్ గుర్తును రాసి, దాని నాలుగు మూలల నుండి కుడి వైపుకు లంబ కోణాన్ని ఏర్పరుచుకునే రేఖను గీయడం ద్వారా ఏర్పడుతుంది.భారతీయ సంస్కృతిలో ఎరుపు రంగుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

హిందువులు తాము ఆచరించే ప్రతి శుభ కార్యంలో స్వస్తిక్ గుర్తును కుంకుమతో తీర్చిదిద్దుతారు.దీని సాధారణ అర్థం శుభం, కల్యాణం.

సింధు లోయ నాగరికతలో ఇటువంటి స్వస్తిక్ చిహ్నాలను కనుగొన్నారు.స్వస్తిక్ గుర్తును హిందువులు గణేశుని చిహ్నంగా భావిస్తారు.

అందుకే ఇది అన్ని శుభ కార్యాలలో ఈ గుర్తును వేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube