అంబేద్కర్ దార్శనికతతోనే బడుగుల జీవితాల్లో వెలుగులు: మాజీ ఎంపీ పొంగులేటి

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ అని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు, ఆయన దార్శనికతతోనే బడుగుల జీవితాల్లో వెలుగులు నిండాయని కొనియాడారు.వైరా, సోమవరంలో అంబేడ్కర్ విగ్రహాలను పొంగులేటి ఆవిష్కరించారు.

 Ambedkar S Vision Illuminates The Lives Of The Poor Former Mp Pongleti , Pongule-TeluguStop.com

అంబేద్కర్ 131 వ జయంతి సందర్భముగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ దేశం గర్వించేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించరన్నారు.

అనేక సంక్షేమ పథకాలు పేదలు దరిచేరుతున్నాయంటే దానికి అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగమే ముఖ్య కారణామన్నారు.ప్రతిఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్, అర్జున్ రావు, గోపాల్ రావు, కట్ల రంగారావు, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, స్థానిక కౌన్సిలర్ పద్మజ, లక్ష్మీబాయి, రాంబాబు, కోసూరి శ్రీనివాస్, ఏలూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube