అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు కోసం 2012 లో 48 గంటల దీక్ష

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం ఎమ్మెల్సీ కవిత చేసిన అకుంఠిత దీక్షకు దశాబ్దం పూర్తి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకై ఇందిరా పార్క్ లో ఎమ్మెల్సీ కవిత 48 గంటల దీక్ష ఎమ్మెల్సీ కవిత దీక్షకు తలొగ్గిన సమైక్య రాష్ట్ర ప్రభుత్వం… అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన ఆనాటి జ్ఞాపకాలను ట్విట్టర్ లో పంచుకున్న ఎమ్మెల్సీ కవిత.

 48 Hours Initiation In 2012 For Erection Of Babasaheb Ambedkar Statue In The As-TeluguStop.com

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం 2012 లో 48 గంటల దీక్ష చేసిన విషయాన్ని ‌ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో పంచుకున్నారు.

భారత రాజ్యాంగ రూపకర్త, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసిన అంబేద్కర్ విగ్రహం చట్ట సభలో ఏర్పాటు చేయాలని హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వేదికగా 2012 ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 15 వరకు ఎమ్మెల్సీ కవిత 48 గంటల దీక్ష చేశారు.వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఎమ్మెల్సీ కవిత దీక్షకు మద్దతుగా నిలిచాయి.

ఎమ్మెల్సీ కవిత దీక్షకు తలొగ్గిన‌ ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.పదేళ్ల మధుర జ్ఞాపకం అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు కోసం 2012 లో 48 గంటల దీక్ష’ అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube