కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్ర పదవి రాకపోవడంతో ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల వైసీపీ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు.ఆయా నాయకులే ఆ నిరసనల్ని కార్యకర్తలు చేపట్టేలా చేశారు.
సీఎం జగన్ దిష్టిబొమ్మలూ తగలబడ్డాయ్ రాష్ట్రంలో పలు చోట్ల.పలువురు మాజీ మంత్రులు రాజీనామా బాట పడుతున్నారు.
ఇంకొందరు ఎమ్మెల్యేలూ రాజీనామా నిర్ణయానికి వచ్చేశారు.
మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మేకతోటి సుచరిత.
మరికొంతమంది ఎమ్మెల్యేలు తమ పదవులు కొనసాగకపోవడంమపై అంసతృప్తితో వుంటే, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, సామినేని ఉదయభాను, వసంత కృష్ణప్రసాద్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పార్ధసారధి, అన్నా రాంబాబు.ఇలా చెప్పుకుంటూ పోతే, డజనుకు పైగా ఎమ్మెల్యేలు మంత్రి పదవులు దక్కకపోవడంతో గుస్సా అవుతున్నారు.వారి అభిమానులు ఆందోలనలు చేస్తున్నారు.
ప్రత్యేక హోదా కోసం ఏనాడైనా ఆయా ఎమ్మెల్యేలు, ఆమా ముఖ్య నేతలు ఇలా హంగామా చేశారా? కనీసం నినదించారా? కేంద్రం మీద నోరు మెదపడానికే ఈ నేతలకు గతంలో అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి అనుమతి లేదాయె.కానీ, ఇప్పుడు ఆ అధినేతే తమను అన్యాయం చేశారన్న కోణంలో.ఆయా నేతలు అన్నిటికీ తెగించేసినట్లు కనిపిస్తోంది.
ఏపీ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? నిజానికి, ఇది నిఖార్సయిన వెన్నుపోటుగానే చెప్పుకోవాలి.90 శాతం మంది మంత్రుల్ని రెండున్నరేళ్ళ తర్వాత మార్చేస్తాం అని ప్రకటించి.నమ్మించి.
ఇప్పుడిలా మోసగించడాన్ని వైసీపీలో చాలామంది నేతలు.ముఖ్యంగా ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు.
మాట తప్పం, మడమ తిప్పం.అంటూ ప్రవచనాలు చెప్పి, వెన్నుపోటు రాజకీయాలంటూ ప్రత్యర్థుల మీద విమర్శలు చేసి.ఇప్పుడేమో మాట తప్పేసి, మడమ తిప్పేసి.నమ్మనివారిని వెన్నుపోటు పొడవడమేంటన్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద వైసీపీ నేతలే చేస్తున్న తాజా విమర్శలు చేసుకుంటున్నారు.