ఇప్పుడున్న సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్స్ అందరూ మొదట తెలుగు సినిమాలలో నటించి తరువాత సౌత్ ఇండియా మొత్తం చుట్టేస్తున్నారు.తెలుగు సినిమాని ఒక లాంచింగ్ ప్యాడ్ గా యూజ్ చేసుకుంటున్నారు తమిళ హీరోయిన్స్.
అవును తెలుగు లో సినిమాలు చేస్తే చాలు తమిళ్ మూవీస్ కి ఎంట్రీ ఈజీ అని కొంత మంది హీరోయిన్స్ ప్రూవ్ చేస్తున్నారు.
కృతి శెట్టి ఈ పేరు తెలియని తెలుగు ఆడియెన్స్ ఉండరు.
ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది.కృతి శెట్టి చేసిన మూవీస్ అన్ని హిట్ గా నిలుస్తున్నాయి.
రీసెంట్ గా వచ్చిన శ్యామ్ సింఘ రాయ్ మరియు బంగార్రాజు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ నీ అందుకున్నాయి.ఇక వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వుంది.
ఇప్పుడు ఈమె తమిళ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది.సూర్య హీరో గా బాల గారి డైరెక్షన్ లో నటిస్తున్న మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని న్యూస్ గట్టిగానే వినిపిస్తుంది.
ఇక నేషనల్ క్రష్ గా పిలవబడే రశ్మిక మందన మొదట కన్నడ మూవీ తో ఎంట్రీ ఇచ్చిన క్రేజ్ మాత్రం తెలుగు మూవీస్ తోనే వచ్చింది.రీసెంట్ గా పుష్ప మూవీ తో ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంది.తెలుగు లో రష్మిక కి వున్న క్రేజ్ వల్ల తమిళ్ లో కార్తీ తో నటించే అవకాశం కొట్టేసింది.సుల్తాన్ మూవీతో తమిళ్ లో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది తెలుగు లో కూడా ఈ మూవీ బాగానే ఆడింది.
ఇక బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ మంచి సినిమాలు చేసింది నిధి అగర్వాల్. బాలీవుడ్ హీరోయిన్ అయిన పట్టించుకోని తమిళ్ ఇండస్ట్రీ ఈమె తెలుగు సినిమాలలో బిజీ అవ్వగానే ఛాన్స్ ఇచ్చింది.అక్కినేని బ్రదర్స్ తో మూవీస్ తీసి తరువాత రామ్ హీరో గా నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో మంచి క్రేజ్ సంపాదించింది నిధి అగర్వాల్.ఈ క్రేజ్ తో తమిళ్ ఇండస్ట్రీ నీ ఎట్రాక్ట్ చేసి శింబు మరియు జయం రవి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
ఇక మెహ్రీన్ కూడా తెలుగు సినిమాల్లో నటించిన తరువాతే తమిళ్ లో ఎంట్రీ ఇచ్చింది.నాచురల్ స్టార్ నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఆ సినిమాతో హిట్ అందుకుంది.ఆ తర్వాత మహానుభావుడు మరియు రాజ ది గ్రేట్ మూవీస్ తో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది.ఆ క్రేజ్ తోనే కేర్ ఆఫ్ సూర్య అనే తమిళ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
ఇక రాశి కన్నా కి కూడా తమిళ్ లో ఛాన్స్ రావడానికి ఐదేళ్లు పట్టింది.ఆక్సిజన్, టచ్ చేసి చూడు, తొలిప్రేమ సినిమాల్లో నటించి తనకంటూ క్రేజ్ ని సంపాదించుకుంది రాశికన్నా.దీనితో తమిళ్ ఇండస్ట్రీ చూపు రాసి కన్నా పై పడింది.అజయ్ జ్ఞాన ముత్తు డైరెక్షన్ లో నయనతార మరియు అతర్వ లీడ్ రోల్స్ లో నటించిన అంజలి సి.బి.ఐ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
ఇక ఈ మధ్యనే వచ్చిన కిలాడి మూవీ లో రవితేజ పక్కన నటించిన మీనాక్షి చౌదరికి మాత్రం తమిళ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టడానికి పెద్దగా టైం పట్టలేదు.అంతేకాదు ఈమే ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో సుశాంత్ కు జోడిగా కూడా నటించింది.ఇప్పుడు విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న కొలై అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తోంది.
ఇక ప్రేజెంట్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో పూజా హెగ్డే ఒకరు.విజయ్ హీరోగా చేసిన తమిళ్ సినిమాతోనే తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అందాల భామ ఆ తరువాత ఒక్క తమిళ్ సినిమా కూడా చెయ్యలేదు.అయితే తెలుగు లో వరుస సినిమాలు చేస్తూ అందరి స్టార్ హీరోస్ తో నటించిన ఈ భామ క్రేజ్ చూసి ఇప్పుడు తమిళ్ స్టార్ హీరో విజయ్ ఏరి కోరి తన బీస్ట్ మూవీ లో ఛాన్స్ ఇచ్చాడు.
రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ లో అరబిక్ కుతు సాంగ్ సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.