దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మరి కొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.గత మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ నెల 25వ తేదీ రాబోతున్న ఈ సినిమా కోసం చిత్రబృందం పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హీరోలు తెలియజేశారు.
ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఇద్దరు హీరోలను ప్రశ్నిస్తూ ఈ సినిమాకి డైరెక్టర్ రాజమౌళి కాకుండా ఇతర డైరెక్టర్ అయితే మీరు ఈ సినిమా చేసేవారా అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సినిమాకి రాజమౌళి కాకుండా వేరే డైరెక్టర్ ఎవరు చేసిన ఈ సినిమాలో మేము నటించే వాళ్ళు కాదని ఈ సందర్భంగా చరణ్ , తారక్ వెల్లడించారు.ఎందుకంటే ఇలాంటి సినిమాలు చేయడానికి జక్కన్న మాత్రమే అర్హుడని పేర్కొన్నారు.
ఇలాంటి సినిమాలు చేయాలనే ఆలోచన ఎవరికీ రాదని, ఇలాంటి సినిమాలను ఏ డైరెక్టర్ కూడా చేయలేరని ఈ సందర్భంగా రాజమౌళి గురించి ఎన్టీఆర్, రామ్ చరణ్ తెలియజేశారు.ఇక ఈ సినిమా చేస్తున్న సమయంలో ఒకరి పాత్రను మరొకరు చేయాలని ఎప్పుడైనా అనిపించిందా అని ప్రశ్నించగా అలాంటి ఆలోచన రాలేదని ఎవరి పాత్రలో వారు చేయడానికి సమయం సరిపోలేదు మరొకరి పాత్ర గురించి ఆలోచించే సమయమే లేదని ఈ సందర్భంగా ఈ హీరోలు తెలియజేశారు.