టాలీవుడ్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్.ఈ సినిమా మార్చి 11న థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన విషయం అందరికి తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు పాజిటివ్ గా కంటే నెగిటివ్ గానే ఎక్కువగా కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే ఇప్పటివరకు సినిమాను చూసిన ఫ్యాన్స్, ప్రేక్షకులు సెకండ్ పార్ట్ స్లోగా ఉంది, అసలు ప్రభాస్ కి ఈ సినిమా సెట్ అవ్వలేదు అంటూ కామెంట్స్ చేసిన వారు ప్రస్తుతం ప్రభాస్ లుక్ కారణంగానే ఈ సినిమా రిజల్ట్ ఈ విధంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియా లో ప్రభాస్ లుక్స్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సాహో సినిమా వరకూ తన లుక్స్ తో అదరగొట్టిన ప్రభాస్ ఆ తర్వాత అభిమానులు కూడా గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు.
లావుగా బొద్దుగా తయారయ్యాడు.కరోనా తరువాత ఒక ఈవెంట్ లో కనిపించి అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు.
అభిమానులు కూడా ఎవరు ఈ పెద్ద మనిషి అనే విధంగా గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు.అయితే ఇక ఇదే లుక్ తో రాధేశ్యామ్ సినిమాలో కనిపిస్తే ఇక అంతే అని అనుకున్నారు.
కానీ సినిమా ప్రమోషన్స్ సమయంలో ప్రభాస్ ఎప్పటిలాగే క్యూట్ గా హ్యాండ్సమ్ గా కనిపించాడు.
కరోనాకు ముందులా హ్యాండ్సమ్ గా కనిపించడంతో అభిమానులు అందరూ హమ్మయ్య అని అనుకున్నారు.అలా హ్యాండ్సమ్ లుక్ లో కనిపించి తన కోసమే అభిమానులు థియేటర్ కి వెళ్ళే విధంగా చేశారు.ఫైనల్ గా ఈ సినిమా క్లాసి హిట్ అనే టాక్ ను డార్లింగ్ లుక్ గా అనే డైలాగ్ ను అభిమానులు తోనే చెప్పించుకున్నాడు ప్రభాస్.
ఇకపోతే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాకు రాధా కృష్ణ దర్శకత్వం వహించగా, ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.అయితే ఇందులో హీరో హీరోయిన్ ల నటనకు మంచి మార్కులే పడ్డాయి.