బెల్లీ ఫ్యాట్ప్రస్తుత రోజుల్లో స్త్రీ, పురుషులను ఇబ్బంది పెట్టే కామన్ సమస్య ఇది.గంటలు తరబడి కూర్చోవడం, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, మద్యపానం, వ్యాయామాలు చేయకపోవడం వంటి కారణాల వల్ల పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోతుంటుంది.
దీంతో పెరిగిన పొట్టను కరిగించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్‌ను తీసుకుంటే గనుక ఎంతటి బాన పొట్టనైనా ఫ్లాట్‌గా మార్చుకోవచ్చు.
మరి లేటెందుకు బెల్లీ ఫ్యాట్‌ను నివారించే ఆ సూపర్ డ్రింక్ ఏంటో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక యాపిల్‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక కీరను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్‌లో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, కీరా ముక్కలు, గుప్పెడు పార్స్లీ ఆకులు, హాఫ్ లీటర్ వాటర్ వేసుకుని బ్లెండ్ చేసుకుని జ్యూస్‌ను గ్లాస్‌లోకి తీసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసం, వన్ టేబుల్ స్పూన్ నిమ్మ రసంకలిపి సేవించాలి.ఒక గ్లాస్ చప్పున ప్రతి రోజు ఈ జ్యూస్‌ను తీసుకుంటే గనుక పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.దాంతో బానలాగా ఉండే మీ పొట్ట నాజూగ్గా, ఫ్లాట్‌గా మారుతుంది.అంతేకాదు, ఈ జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల నీరసం, అలసట వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
గుండె ఆరోగ్య వంతంగా మారుతుంది.డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండొచ్చు.
కంటి చూపు మెరుగు పడుతుంది.ఎముకలు దృఢంగా తయారు అవుతాయి.
మరియు మెదడు మునుపటి కంటే చురుగ్గా పని చేస్తుంది.కాబట్టి, బెల్లీ ఫ్యాట్‌తో బాధపడేవారు మాత్రమే కాదు.
ఎవ్వరైనా పైన చెప్పిన జ్యూస్‌ను తయారు చేసుకుని తీసుకోవచ్చు.