ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మల్సీగా, మంత్రిగా మూడు దశాబ్ధాలు రాజకీయాల్లో ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎంత కలకలం రేగిందో తెలిసిందే.ఆయన హత్య జరిగి సరిగ్గా మూడేండ్లు అవుతోంది.
పులివెందులలోని తన సొంత ఇంటిలోనే దారణ హత్యకు గురయ్యాడు.ఎంత పేరున్నాఆయనను మాత్రం అజాత శ్రతువుగా పేర్కొంటుండడం గమనార్హం.
ఆయన హత్య విషయంలో అప్పటి అధికార టీడీపీలోని కొందరి హస్తం ఉందని, మరోవైపు వైసీపీ వర్గపోరే కారణమనే ఆరోపణలొచ్చాయి.కాగా తొలుత గుండెపోతుతో చనిపోయారని ప్రచారం జరగడం.
ఆ తరువాత హత్యగా తేలడం అంతా హైడ్రామాగా సాగిపోయిన విషయం విధితమే.
నాడు వివేకా హత్యఘటనపై నాటి ఏపీ ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.వివేకా హత్య అనంతరం హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరి మీడియాతో మాట్లాడారు.వైఎస్ కుటుంబంపై చంద్రబాబు కుట్రలు ఎలా పన్నారో వివరించారు.
బాబు సీఎంగా ఉన్నపుడే తన తాత రాజారెడ్డి హత్యకు గురయ్యారని.ఎవరు ఫినిష్ అవుతారో చూద్దాం అంటూ వ్యాఖ్యానించారు.
ఆ మరుసటి రోజే తన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించారని, బాబు సీఎం ఉన్నప్పుడు తన పాదయాత్రలో కోడి కత్తితో దాడి జరిగిందని చెప్పుకొచ్చాడు.నాడు పోలీసులతో న్యాయం జరగదని భావించి సీబీఐ విచారణ కోరారు.
ఈక్రమంలోనే వైసీపీ అధికారంలోకొచ్చింది.కాగా సీబీఐ విచారణలో జాప్యం నెలకొంది.
చివరికి కోర్టు జోక్యంతో కేసు సీబీఐ చేతిలోకి వెళ్లింది.సుమారు రెండేండ్లుగా విచారణ జరుగుతోంది.
ఈక్రమంలో వైఎస్ వివేకా కూతురు డాక్టర్ సునీతారెడ్డి అల్లుడు నర్రేడి రాజశేఖర్‌రెడ్డి సహా పలువురి వాంగ్మూలాలు రికార్డు చేశారు.ఇవి నేడు వెలుగులోకొస్తున్నాయి.
కాగా తండ్రి వివేకా మత్య కేసును సబీఐకి అప్పగించాలని సునీత కోరారు.దీనికి సీఎం బదులిస్తూ… సబీఐకి ఇస్తే ఏమవుతుంది ? కడప ఎంపీ అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతాడు.అంటూ వ్యాఖ్యానించారని సమాచారం.ఇక్కడ బీజేపీ ప్రస్థావన తీసుకురావడం చర్ఛణీయాంశంగా మారింది.
అదికూడా తమ్ముడు ఎంపీని ఉద్ధేశించి జగన్ మాట్లాడడం చర్చకు దారితీస్తోంది.ప్రస్తుతం దేశంలో బీజీపే విధానాలు ఇందుకు అద్దంపడుతున్నట్టు కనిపిస్తోంది.ప్రస్తుత మోడీ, షాకు నాటి అడ్వాని, వాజ్‌పేయీ రాజకీయ సిద్ధాంతాలకు వ్యత్యాసం ఉందని పలువురు అంటున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం బీజేపీ ఏకీపారేస్తున్నారు.ఇలా చెప్పుకుటూ పోతే మహారాష్ట్ర,మధ్యప్రధేశ్ తదిర రాష్ట్రాల్లోనూ బీజీపేపీకి వ్యతిరేక గళం వస్తోంది.అలాగే 2019 ఎన్నికల అనంతరం టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్ సుజానా చౌదరి , టీజీ వెంకటేష్ బీజేపీలో చేరారు.
అయితే బీజేపీ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఎవరిని పడితే వారిని పార్టీలో చేరు్చకుందనే ఆరోపణలున్నాయి.మహారాష్ట్రలో పలువురు నేతలకు కూడా బీజేపీలో చేరాక కేసుల నుంచి ఉపశమనం లభించిందని అక్కడి నేతలే చెప్పడం గమనార్హం.
రీసెంట్‌గా ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇలానే ఉన్నాయి.కేసుల బూచి చూపి ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరేలా చేస్తోందనే విమర్శలకు దారితీస్తోంది.
మొత్తంగా జగన్ వ్యాఖ్యలు బీజేపీ పరువు తీసేలా ఉన్నయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.