ఆ ప్రవాసులకు హ్యాండ్ ఇచ్చిన కువైట్...ఇక వారు ఇంటికే...!!

వలస కార్మికులు అత్యధికంగా వెళ్ళే దేశం ఏదైనా ఉందంటే అది కువైట్ అని నిస్సందేహంగా చెప్పచ్చు.కార్మికులుగా పనిచేసేందుకు భారత్ నుంచీ అధిక శాతం గల్ఫ్ దేశాల వైపు వలసలు వెళ్తూ ఉంటారు, కేవలం భారత్ మాత్రమే కాదు శ్రీలంక, ఈజిప్ట్ ఇలా పలు దేశాల నుంచీ కువైట్ వంటి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువే అయితే తమ దేశానికి వలస వచ్చే వారి విషయంలో కువైట్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంక్షలు విధిస్తోంది.

 No Visa Renewal For Those Over 60 In Kuwait Without Degree, Visa Renewal, Kuwait-TeluguStop.com

సుమారు ఏడాది నుంచీ కువైట్ 60 ఏళ్ళు పై బడిన వలస కార్మికుల విషయంలో కప్ప గెంతులు గెంతుతోంది.

కాసేపు 60 ఏళ్ళు దాటిన వలస వాసులు డిగ్రీ ఉండాలని అంటూనే కొని రోజుల తరువాత డిగ్రీ తో పాటు తప్పకుండా వారి ఆదాయం భారీగా ఉండాలని షరతులు పెడుతుంది.మరో సారి డిగ్రీ లేకపోయినా పరవాలేదు ఈ కేటగిరి వాసులు కేవలం రూ.60 వేలు చెల్లించి వర్క్ పర్మిట్ లను రెన్యువల్ చేసుకోవాలని సూచిస్తోంది.అయితే కువైట్ ప్రభుత్వం ఎలాంటి నిభందనలు విధించినా సరే ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకుంటూ వస్తున్న ప్రవాసులు అధిక రుసుములు చెల్లించడానికి కూడా సిద్దపడ్డారు.గడిచిన కొన్ని రోజుల క్రితం

60 ఏళ్ళు పై బడిన వలస వాసులు వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం వెళ్ళగా వారి వీసాలను రెన్యువల్ చేయాలంటే మరింత ఖర్చు అవుతుందని చెప్పడంతో అందుకు కూడా సిద్దపడ్డారు.

కానీ తాజాగా కువైట్ ప్రభుత్వం నేరుగా ఓ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది.డిగ్రీ పట్టా లేకుండా వర్క్ పర్మిట్లను రెన్యువల్ చేసేది లేదంటూ మరో సారి తేల్చి చెప్పింది.

దాంతో ఈ కేటగిరి కి చెందిన ప్రవాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.డిగ్రీ పట్టా లేకుండా 60 ఏళ్ళు దాటిన వారు సుమారు 30 వేల మంది పైనే ఉంటారని అక్కడి గణాంకాలు చెప్తున్నాయి.

మరి తాజాగా కువైట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం డిగ్రీ పట్టా లేని గడువు ముగిసిన 60 ఏళ్ళు పైబడిన వలస కార్మికులు కువైట్ ను వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది.అయితే ఈ విషయంపై కువైట్ లోని ప్రవాస సంఘాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో వేచి చూడాల్సిందే.

No Visa Renewal For Those Over 60 In Kuwait Without Degree

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube