సీఎం బీమ్లా నాయక్ కి కొత్తగా ఎటువంటి షరతులు పెట్టలేదు కొడాలి నాని

జగన్ ని అధికారంలో నుంచి దించాలని ఎదో రకంగా తగాదాలు పెట్టి ఒక గుంపు ప్రయత్నిస్తోంది.  చంద్రబాబు చేసే ప్రయత్నాల్లో మీరంతా బలి పశువులు కావద్దు ఈ సీఎం బీమ్లా నాయక్ కి కొత్తగా ఎటువంటి షరతులు పెట్టలేదు అఖండ, పుష్ప సినిమాలకు అదే నిబంధనలు ఉన్నాయి.

 Kodali Nani Comments On Bheemla Nayak Movie, Bheemla Nayak , Kodali Nani, Ys Jag-TeluguStop.com

జగన్ కి సన్నిహితుడు నాగార్జున సినిమాకి కూడా అదే రూల్ అది పవన్ కళ్యాణ్ సినిమా అయినా అదే రూల్ ఎక్కడా ఎవరికీ తేడా చూపించలేదు .జగన్ ప్రజల గురించి ఆలోచిస్తారు.శత్రువు, మిత్రుడి గురించి కాదు సినిమా పరిశ్రమ ఈ రకంగా తయారు కావడానికి చంద్రబాబు కారణం కదా కమిటీ వేసి నిర్ణయం తీసుకోమంటే వేయకుండా టికెట్లతో దోచుకుంటుంటే దృతరాష్ట్రుడిలా చూస్తూ కూర్చున్నాడు.అటువంటి బాబుకి తొత్తులుగా కొంత మంది వ్యవహరిస్తున్నారు.

వీలంతా ఈ రోజు పవన్ కి తోడేళ్ళుగా ముసుగు వేసుకుని పవన్ పై విపరీతమైన ప్రేమ చూపుతున్నారు .జగన్ పవన్ ని ఏదో చేసాడు అంటూ కథలు ఆల్లుతున్నారు అటువంటి ద్రోహికి పవన్ సహకరించడం దురదృష్టం సినిమా పెద్దలు వచ్చి కొన్ని సూచనలు చేశారు.సీఎం కి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి.  కోర్ట్ ఒక కమిటీ నియమించమని చెప్పింది .లీగల్ గా అడ్డంకులు లేకుండా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి.  ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవో ఇవ్వాలి .ఇవన్నీ బీమ్లా నాయక్ ప్రొడ్యూసర్స్ కి, పవన్ కి కూడా తెలుసు.

తల్లి లాంటి సినిమాని కూడా రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు.

  చంద్రబాబు చూపిన దారిలో మీరు వెళ్లడం సిగ్గుచేటు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్  అందింది.అతనికి ఎటువంటి నష్టం లేదు చంద్రబాబు మీ వెల్ విషెర్ అనుకుని నువ్వు ముందుకు వెళితే మీకే నష్టం వాళ్ళ మాటలు విని ముఖ్యమంత్రిపై ద్వేషం పెంచుకోవద్దు.

  జగన్ ముఖ్యమంత్రి కాకూడదనే దానికి వాళ్ళు ఎవర్ని అయినా వాడుకుంటారు.చిరంజీవి, ఆయన సతీమణి ని గుమ్మంలో నిలబడి జగన్ దంపతులు ఆహ్వానించారు .  పవన్ మర్చిపోయాడా.? సంక్రాంతికి చిరంజీవి గారిని  ఇంట్లోకి తీసుకెళ్లి గౌరవించారు.భారతమ్మ వడ్డించింది అని చిరంజీవి చెప్పింది వినలేదా సినిమా పరిష్కారం కోసం ఒక బృందం వచ్చింది.  అది అధికారిక సమావేశం…క్యాంప్ ఆఫీస్ లోకి అసలు కారు వెళుతుందా మేము కూడా బయట కారు ఆపుకుని సెక్యూరిటీ చెక్ అయ్యాక లోపలికి వెళ్తాం చిరంజీవి ఆయన దగ్గర పని చేసే డ్రైవర్ ని కూడా గౌరవించే వ్యక్తి తమ్ముడైనా పవన్ ని లేచి నిలబడి ఆహ్వానించే వ్యక్తి చిరంజీవి.

ముఖ్యమంత్రి స్థానంలో తల్లిలా ఇండస్ట్రీ కి మేలు చేయమని కోరారు.

ఆ దుర్మార్గులు చంద్రబాబు విమర్శించారు.ఒక అన్నగా ఒంగి ఒంగి నమస్కారాలు అని సొంత తమ్ముడిగా మాట్లాడొచ్చా నిన్ను కూడా చూడగానే వాటేసుకుంటాడుగా అటువంటి వ్యక్తిని ఈ 420 గాళ్లతో కలిసి అలా మాట్లాడొచ్చా ఈ 420 గాళ్ల ఉచ్చులో పవన్ కళ్యాణ్ పడొద్దు వీళ్ళ మాటలు విని సినిమాను ముందుకు తెచ్చి మాపై ఆరోపణలు చేయొద్దు.బ్లాక్ లో టికెట్లు అమ్మితే ఎవర్నీ ఉపేక్షించవద్దని సీఎం స్పష్టంగా చెప్పారు .రాబోయే ఎన్నికల్లో కూడా జగన్ ఒంటరిగా పోటీ చేస్తాడు .ముఖ్యమంత్రిపై నోటికి ఇష్ట మొచ్చినట్లు మాట్లాడటానికి పవన్ మద్దతు ఇవ్వొద్దు .మళ్లీ నూటికి నూరు శాతం జగన్ ముఖ్య మంత్రిగా గెలుస్తాడు.  మీరు చంద్రబాబు మాటలు విని మిమ్మల్ని గెలవకుండా ఈ దొంగలు చేస్తున్నారు.

  నీపై ప్రేమ నటిస్తున్న వాళ్ళని నమ్మి మోసపోవద్దు.  సీపీఐ నారాయణ ఒక వింత జంతువు చంద్రబాబుతో కలిసి జాతీయ పార్టీ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాఫుతున్నాడు .వివేకా హత్యలో జగన్ ప్రమేయం ఉందంటున్నాడు .రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం చేయడం తప్పా రైటా అనేది నారాయణ చెప్పాలి పదిమందిని చంపి జగన్ పై వేయాలని వీరంతా చూస్తూ ఉంటారు .

Telugu Ap Poltics, Ap Ticket Rates, Bheemla Nayak, Chandra Babu, Kodali Nani, Pa

యుద్ధంలో చిక్కుకున్న వారికి అభినందలు చెప్తున్నాడు ఇలా మైండ్ చెడిపోయి ఒక జూమ్ యాప్ లో ఏదేదో మాట్లాడుతున్నాడు .ఒక సినిమాను తీసుకొచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రితో పోల్చడం సరికాదు ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన సినిమాలు చూడొద్దని లోకేష్ సోషల్ మీడియాలో చెప్పించిన ఘనత వాళ్ళది చట్టం ముందు ఎవరైనా ఒకటే…ప్రజల తరపున ఆలోచించే వ్యక్తి జగన్ భారతి సిమెంట్ లో 235 రూపాయలతో నాడు నేడు, నీటి ప్రాజెక్టులు, ఇళ్లు నిర్మాణానికి సిమెంట్ ఇస్తున్నారు నువ్వు హెరిటేజ్ తో మజ్జిగ కేంద్రాలకు అమ్ముకున్నావు.  చంద్రన్న కానుకను హెరిటేజ్ నుంచి నెయ్యి అమ్ముకున్న దుర్మార్గుడు చంద్రబాబు.

Telugu Ap Poltics, Ap Ticket Rates, Bheemla Nayak, Chandra Babu, Kodali Nani, Pa

ఒక్క పైసా కూడా తగ్గించకుండా లూటీ చేసిన చంద్రబాబుకి భారతి సిమెంట్ గురించి మాట్లాడే హక్కు లేదు భారతి సిమెంట్, హెరిటేజ్ చేసిందేమిటో చర్చకు ఎక్కడికైనా వస్తాం.మీరు సిద్ధమా.ఇటువంటి గుంటనక్కల ఉచ్చులో పవన్ కళ్యాణ్ పడొద్దు సినిమా పరిశ్రమ ఏపీలోకి తీసుకురావాలని మా ముఖ్యమంత్రి తపన నాగబాబు మాట్లాడినా, 420 మీడియా చెప్పుడమైనా ఒకటే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయలేదు .ఏ సినిమా అయినా, ఎవరి సినిమా అయినా సడలింపులు ఇవ్వలేదు బంగార్రాజు, అఖండ సినిమాలకు కూడా ఇదే రూల్ పవన్ సినిమాకి ఎక్కడైనా ఒక్క థియేటర్ సీజ్ చేసామా.ఆయన రాజకీయం కోసం సినిమాను ముందుకు తీసుకొస్తే మాకేంటి సంబంధం .మీ పార్టీ ని మీరు డెవెలప్ చేసుకోండి.పవన్ ని ప్రతిపక్ష నేత, ముఖ్య మంత్రిగా ఏది కావాలంటే అది చేసుకోండి కానీ చంద్రబాబు లాంటి గుంట నక్కల ఉచ్చులో పడొద్దని పవన్ అభిమానులకు నా సలహా.

  జగన్ మోహన్ రెడ్డి ఇలాంటి వాటికి భయపడతాడా.ఆయనకు భయం అనే పదం తెలిస్తే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టేవాడా.పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేసేవాడా…? అధికారంలో ఉన్న సోనియా గాంధీని వ్యతిరేకించిన వ్యక్తి జగన్ జగన్ ని భయపెట్టాలనుకుంటే అది వారికి కలగానే మిగిలి పోతుంది.

కొండనైనా ఢీకొట్ట గల ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి జగన్ ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్న వ్యక్తి జగన్.

  జగన్ ఈ దేశంలోనే పొలిటికల్ మెగాస్టార్ మిగిలిన రాజకీయ పార్టీలు విలన్స్, కమెడియన్స్ గా మిగిలిపోతారు .వీళ్లంతా జగన్ ని అంగుళం కూడా కదిలించలేవు…ఆయన ఒక వ్యవస్థ ఇక్కడి బీజేపీ నేతల్ని ఢిల్లీ వెళితే అక్కడి పెద్దలు తిడతారు.  ఏ ఎన్నికలో కనీసం డిపాజిట్స్ కూడా తెప్పించలేక పోతున్నారు .కేంద్రంలో అధికారంలో ఉండి ఎందుకు ఈ దుస్థితి ఉంది.కేవలం చంద్రబాబు ఏది చెప్తే అదే అమలు చేస్తున్నారు కాబట్టి ఏపీ బీజేపీ కి ఈ పరిస్థితి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube