వైరస్ వ్యాధులు కేరళలో ఎందుకు మొదట‌గా వ‌స్తాయంటే... కార‌ణ‌మిదే!

భారతదేశంలో దక్షిణాన ఉన్న కేరళ, భౌగోళికంగా చాలా ముఖ్యమైన రాష్ట్రం.ఇది ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ విద్యావంతులను కలిగి ఉన్నందున దీని ప్రాధాన్య‌త అధికం.

 Why Virus Based Diseases Outbreak In Kerala Details, Kerala Stare, Viral Disease-TeluguStop.com

ఇక్కడ అక్షరాస్యత శాతం 94 శాతం.అంతే కాకుండా కేరళ తన ప్రకృతి అందాలతో ప్రజలను తనవైపు ఆకర్షిస్తుంది.

అయితే గత కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాలు, వెక్టర్ ద్వారా సంక్రమించే అంటు వ్యాధుల సమస్యల కార‌ణంగా కేర‌ళ చ‌ర్చ‌ల‌లో నిలిచింది.కేరళలో నివసిస్తున్న ప్ర‌తీ కుటుంబానికి చెందిన‌ కనీసం ఒక వ్య‌క్తి విదేశాలలో నివసిస్తున్నారని తెలుస్తోంది.

అటువంటి పరిస్థితిలో బయటి ప్రాంతాల నుండి ఈ రాష్ట్రానికి వ‌చ్చేవారి వ‌ల్ల వ్యాధులు ప్ర‌భ‌లుతున్నాయ‌ని నిపుణులు భావిస్తున్నారు.

భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ అంటు వ్యాధులు, ముఖ్యంగా వైరల్ వ్యాధులు వ్యాప్తి చెందడం చాలా ఎక్కువ.

అహ్మదాబాద్‌కు చెందిన మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ దీపక్ ఆచార్య తెలిపిన వివ‌రాల ప్రకారం గత కొన్నేళ్ల డేటాను పరిశీలిస్తే, కేరళలో నిపా వైరస్, ఇన్ఫ్లుఎంజా, హెపటైటిస్ బి, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్, వెస్ట్ నైల్ వైరస్, జపనీస్ ఎన్సెఫాలిటిస్, క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ వైరస్, కాక్స్‌సాకీ వైరస్ టైప్ బి3, చికున్‌గున్యా వైరస్, హ్యూమన్ అడెనోవైరస్, మీజిల్స్ వైరస్, హెపటైటిస్ ఎ వైరస్, జికా వైరస్, డెంగ్యూ వైరస్, లెప్టోస్పిరోసిస్ (ఎలుక జ్వరం), స్వైన్ ఫ్లూ మరియు కరోనా వైరస్ వంటి వైరల్ వ్యాధులు వ్యాపించాయి.

టూరిజం పరంగా కేరళ ఒక ముఖ్యమైన రాష్ట్రం.2018 మరియు 2019 సంవత్సరాల్లో రికార్డు స్థాయిలో పర్యాటకులు కేరళకు వచ్చారు.పర్యాటక పరంగా, కేరళ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను అధిగమించింది.2019 సంవత్సరంలో, కేరళ కేవలం ఒక సంవత్సరంలో 1.96 కోట్ల మంది పర్యాటకులను ఆక‌ట్టుకుంది.ఇది 2018తో పోలిస్తే 17% కంటే ఎక్కువ.భారీగా ప‌ర్యాట‌కు రావ‌డం కార‌ణంగా అంటు వ్యాధులు ప్ర‌భ‌లుతున్నాయ‌ని నిపుణులు ప్రాథ‌మికంగా తేల్చారు.అంటు వ్యాధుల స్క్రీనింగ్ కోసం ఎటువంటి సత్వర యంత్రాంగం లేకపోవడం సమస్యగా ప‌రిణ‌మించింద‌ని వారు ఆరోపిస్తున్నారు.

Why is Kerala hotbed of Infectious Diseases

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube