భర్త గొంతు విని ఎమోషనల్ అయిన చిరంజీవి సర్జా భార్య ..వీడియో వైరల్!

కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని అతి చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించిన వారిలో నటుడు చిరంజీవి సర్జా ఒకరు.ఈయన తన కెరియర్ లో స్టార్ నటుడిగా అప్పుడప్పుడే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి అతి చిన్న వయసులోనే మరణించడం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పవచ్చు.

 Chiranjeevi Sarja Wife Get Emotional After Hearing Her Husband Voice Video Goes-TeluguStop.com

ఈ విధంగా కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ నటుడుగా కొనసాగుతూ పెళ్లి జరిగిన రెండు సంవత్సరాలకే ఈయన మరణించడమే కాకుండా ఈయన మృతి చెందే సమయానికి అతని భార్య మేఘన రాజ్ ఐదు నెలల గర్భిణీ కావడం అందరినీ ఎంతో కృంగదీసింది.

ఈ విధంగా అతి చిన్న వయసులోనే భర్తను కోల్పోయి అతని జ్ఞాపకాలతో ఎంతో ధైర్యంగా నిలబడిన మేఘనా రాజ్ తాజాగా డాన్స్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

ఇక వాలెంటెన్స్ డే సందర్భంగా చిరంజీవి సర్జా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత తన భార్య మేఘనకు ఇచ్చిన కానుకలను ఈ కార్యక్రమంలో తనకు ఇస్తూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేశారు.ఈ క్రమంలోనే మేఘనారాజ్ అవి తనకు చిరంజీవి ఎప్పుడు ఇచ్చారు అనే విషయాల గురించి తెలియజేశారు.

ఇలా తనకు పంపించిన ఆ గిఫ్ట్ గురించి మాట్లాడుతున్న క్రమంలోనే చిరంజీవి సర్జా పాత వీడియో ఒకటి ప్లే చేశారు.తనని విష్ చేస్తూ చెప్పిన మాటలకు మేఘన రాజ్ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తన భర్త గొంతు వినగానే తన మనసులో ఉన్న బాధను ప్రేమను బయట పెడుతూ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఇక చిరంజీవి సర్జా మాట వినగానే అక్కడున్న కంటెస్టెంట్ లు సైతం ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Chiranjeevi Sarja Wife Get Emotional After Hearing Her Husband Voice Video Goes Viral, Chiranjeevi Sarja, Wife, Meghana, Emotional, Husband Voice, Video Viral - Telugu Meghana

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube