టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha ) ప్రస్తుతం తన వెబ్ సిరీస్ హాని బన్నీ( Honey Bunny ) ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ వెబ్ సిరీస్ నవంబర్ ఏడో తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత (Samantha) వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ తన సినీ కెరియర్ గురించి అలాగే వ్యక్తిగత విషయం గురించి ఇక తన ఆరోగ్య సమస్యల గురించి ఎన్నో విషయాలు తెలిపారు.
ఈ వెబ్ సిరీస్ లో సమంత స్పై ఏజెంట్ గా నటించబోతున్నారు.మీ నిజ జీవితంలో కూడా అలా ఎప్పుడైనా ఉన్నారా అనే ప్రశ్న ఈమెకు ఎదురయింది.ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ నేను కనుక నా జీవితంలో అలాగ ఉండి ఉంటే ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ పరోక్షంగా నాగ చైతన్య ( Nagachaitanya ) సమంత జీవితంలోకి శోభిత( Sobhita ) రావడం గురించి ఈమె కామెంట్లు చేశారు.
ఇక నాగచైతన్య సమంత విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత నాగ చైతన్య తిరిగి రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే నటి శోభితతో ఈయన నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు.త్వరలోనే వీరి వివాహం జరగబోతుంది.ఇక నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడంతో సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుందని పలువురు భావించారు.
అయితే సమంత తన రెండో పెళ్లి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తాను ఎంతో ఇష్టపడి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను.
ప్రస్తుతం విడిపోయామని, తన జీవితంలో ఇక రెండో పెళ్లి అనే ప్రసక్తి కానీ, మరో వ్యక్తికానీ ఎవరూ ఉండరని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది.దీంతో అందరూ సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు.