ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ( Chandra Babu Naidu ) తాజాగా బాలకృష్ణ ( Balakrishna ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్( Un Stoppable )కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.తాజాగా ఈ ఎపిసోడ్ ప్రసారం కావడంతో చంద్రబాబు నాయుడు ఎన్నో విషయాలను వెల్లడించారు.
ముఖ్యంగా ఆయనను అరెస్టు చేయడం, పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) తో పొత్తు గురించి కీలక విషయాలు బయట పెట్టారు.
అసలు ఈ పొత్తు ఆలోచన ఎవరిదనే విషయంపై కూడా అందరికీ ఎన్నో సందేహాలు ఉండేవి.ఈ విషయం గురించి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.తాను జైలులో ఉన్న సమయంలో లోకేష్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ముగ్గురు నన్ను కలవడానికి వచ్చారు.
అలా జైలు గోడల మధ్య పవన్ కళ్యాణ్ నాతో మాట్లాడుతూ బాగున్నారా సార్ మీరు అధైర్య పడకండి అంటూ మాట్లాడారు.ఆ సమయంలో పవన్ కళ్యాణ్ తో నేను మాట్లాడుతూ నేను ధైర్యంగా ఉన్నాను.
ఎప్పటికీ ధైర్యాన్ని కోల్పోను.మీరు ఆ ధైర్య పడవద్దు అని చెప్పాను.
ఆ సమయంలో రాష్ట్ర పరిస్థితులు చూసి పొత్తు అంశాన్ని నేనే బయట పెట్టాను.ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి అంటే మనం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ కి చెప్పాను.ఆ సమయంలో పవన్ ఆలోచించి పొత్తుకు ఓకే చెప్పడమే కాకుండా బీజేపీతో కూడా మాట్లాడి పొత్తుకు ఒప్పిస్తానని మాట ఇచ్చారు.అలా ఆరోజు మేము తీసుకున్న ఈ నిర్ణయం మా విజయానికి నాంది అంటూ చంద్రబాబు నాయుడు తెలిపారు.
జైలు గోడలు మధ్య ఈ నిర్ణయం తీసుకున్న తరువాతనే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగబోతున్నామని ప్రకటించారంటూ చంద్రబాబు నాయుడు తెలిపారు.పొత్తు గురించి బాబు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.