భర్తను చితకబాదిన స్టార్ హీరోయిన్ జెనీలియా.. అసలేం జరిగిందంటే?

తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా స్టార్ హీరోయిన్ గా జెనీలియా వెలుగు వెలిగారనే సంగతి తెలిసిందే.తమిళంలో బాయ్స్ సినిమాతో తెలుగులో సత్యం సినిమాతో నటిగా జెనీలియా కెరీర్ ను మొదలుపెట్టారు.

 Genelia Shared Funny Video Creates Sensation In Social Media Details, Heroine Ge-TeluguStop.com

జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా జెనీలియా నటించిన సాంబ, నా అల్లుడు సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.ఒకవైపు యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూనే మరోవైపు సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కు జోడీగా సుభాష్ చంద్రబోస్ సినిమాలో జెనీలియా నటించారు.

బొమ్మరిల్లు, ఢీ, రెడీ సినిమాలతో జెనీలియా పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగింది.అయితే నా ఇష్టం సినిమా తర్వాత జెనీలియా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూర మయ్యారు.

తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఈమె నటించారు.అయితే తాజాగా జెనీలియా భర్తను చితక బాదారు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.జెనీలియా తన ఇన్ స్టాగ్రామ్ లో రితేష్ దేశ్‌ ముఖ్‌ తో డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేశారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జెనీలియా ఈ వీడియోలో నాచ్ నాచ్ నాచ్ అనే పాటకు డ్యాన్స్ చేశారు.

తను డ్యాన్స్ చేయడం ఆపినా భర్త డ్యాన్స్ చేయడం ఆపకపోవడంతో ఆమె భర్తను చితకబాదారు.భర్తను కొట్టేముందు జెనీలియా వెరైటీగా ఎక్స్ ప్రెషన్లు ఇచ్చారు.జెనీలియా చేతిలో దెబ్బలు తింటూనే రితేష్ డ్యాన్స్ చేయడం గమనార్హం.

అయితే జెనీలియా ఫన్ కోసమే రితేష్ ను కొట్టారని వీడియో చూస్తే అర్థమవుతోంది.

జెనీలియా పోస్ట్ కు ఏకంగా 1 మిలియన్ లైక్స్ వచ్చాయని తెలుస్తోంది.జెనీలియా మళ్లీ వరుసగా సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరు కుంటుండగా తెలుగు సినిమాల్లోకి జెనీలియా రీఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

Genelia DSouza and Riteish Deshmukh Funny Video Goes Viral

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube