తెలంగాణ రాజకీయాలలో కేసీఆర్ ను మించిన అనుభవం కలిగిన రాజకీయ నాయకుడు ఎవరూ లేరన్నది సుస్పష్టం.అయితే ఇప్పటికే రెండు దఫాలుగా గెలిచి ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో ముచ్చటగా మూడో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున బలంగా భావిస్తున్న కేసీఆర్ ఇక ఇప్పటి నుండే బీజేపీని టార్గెట్ చేస్తూ ఎన్నికల వాతావరణాన్ని సృష్టిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కాబట్టి అప్పటికప్పుడు పరిస్థితులను బట్టి ఎలాంటి వ్యూహ రచన చేస్తారనే విషయం పై మనం ఇప్పుడే ఏమీ చెప్పలేక పోయినా భవిష్యత్తు లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.అయితే ఇక రానున్న రోజుల్లో చాలా వేగవంతంగా జిల్లాల పర్యటన చేపట్టడం.
ఇక జిల్లాల్లో ఇప్పటికే చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం లాంటి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఇటు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అయితే టీఆర్ఎస్ కు ప్రధాన పోటీ అని భావిస్తున్నారో ఆ పార్టీ బీజేపీ మాత్రమే కాబట్టి ఇప్పటి నుండే విమర్శల వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.అయితే ఎన్నికల వాతావరణాన్ని ఇప్పటి నుండే సృష్టించడం ద్వారా ఇటు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూనే ఇటు రాజకీయంగా కూడా ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టే విధంగా వ్యూహాలు కదుపుతున్న పరిస్థితి ఉంది.
అయితే కేసీఆర్ విమర్శలకు బీజేపీ ప్రతి విమర్శ చేస్తున్నా అంతగా ప్రజల్లోకి వెళ్లని పరిస్థితి ఉంది.అయితే ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎన్నికల సమయంలో కేసీఆర్ స్పీడును బీజేపీ అందుకుంటుందా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను తిప్పుకున్నంతలా బీజేపీ తిప్పుకోగలుగుతుందా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది.