ఏపీ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు వివాదాలకు తావిస్తోంది.కొన్ని జిల్లా కేంద్రాలు మార్చాలని, కొన్ని జిల్లాల పేర్ల విషయంలోనూ అభ్యంతరాలు తలెత్తుతున్నాయి.
ఈక్రమంలో కొన్ని జిల్లాల పేర్ల మార్పుపై ప్రతిపక్ష టీడీపీ తీవ్ర అభ్యంతరాలు తెలుపుతోంది.ఉద్యమాలకు కూడా సిద్ధమవుతోంది.
ఇప్పటికే జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల డిమాండ్‌తో టీడీపీ నేతలు ఆందోళన బాట పట్టారు.భారీ ధర్నా చేపట్టేందుకు కూడా ప్లాన్ చేశారు.
అవసరమైతే సీఎం జగన్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రకటన కూడా జారీ చేశారు.మొత్తంగా వైసీపీ చేపట్టిన జిల్లా రాకీయాలతోనే టీడీపీ కౌంటర్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వర్‌రావు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేయడంతోపాటు ధర్నాకు పిలుపునిచ్చారు.వైసీపీ తీరుపై విమర్శలు గుప్పించారు.
గుడివాడ వ్యవహారాన్ని పక్దారి పట్టించడానికే కొత్త జిల్లాల అంశాన్ని జగన్ తెరపైకి తెచ్చారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.విజయవాడ కేంద్రంగా ఏర్పాటయినా జిల్లాకు వంగవీటి రంగా పెరు పెట్టాలని, లేదంటే ఉద్యమం ఆపమంటూ చురకలంటించారు.
కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రధానంగా కృష్ణా జిల్లాను రెండుగా విభజించారని, విజవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని, మరో జిల్లాకు మహానేత వంగవీటి రంగా పేరు పెట్టాలని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర్‌రావు తెరపైకి తీసుకొచ్చారు.మచిలీపట్నం జిల్లాగా మరో జిల్లా ఏర్పాటు కాబోతోంది.
ఇందులో ఎన్టీఆర్ స్వస్థలం ఉంది.దీంతో జిల్లా పేర్ల విషయంలో ఒక దానికి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
విజయవాడలో వంగవీటి రంగా విగ్రహం లేని ప్రాంతమే లేదని, ఆయన పేరు ఒక జిల్లాకు పెట్టకుంటే జగన్ రంగాను అవమానించినట్టే అవుతుందంటూ ఏకి పారేశారు.రంగా కుటుంబ సభ్యులు, వారి సన్నిహితులు కొడాలి నాని, వల్లభనేని వంశీలకు జగన్ చెబితే పెరుపెడతారని బోండా చెప్పారు.
ఈ తతంగం అంతా ధర్నతో ఆగకుండా మరింత రాజకీయం ముదిరే అవకాశాలు లేకపోలేదు.ఇప్పటికే రంగాను అవమానపర్చిన జగన్ బంధువు గౌతంరెడ్డి కీలక పదవిలో ఉన్నారు.
వీటితోపాటు మరిన్ని అంశాలు తెరపైకొచ్చి రాజకీయ దుమారం లేచే అవకాశం లేకపోలేదు.