ఆ విష‌యంలో చంద్ర‌బాబు ప్లాన్ నెర‌వేరేనా ?

అప‌ర రాజ‌కీయ చాణక్యుడు అని ఎవ‌రంటే చంద్ర‌బాబు నాయుడు అనే పేరు గుర్తుకొస్తుంది.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన త‌రువాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మొద‌టి సీఎం చంద్ర‌బాబే.

 Is Chandrababu's Plan Fulfilled In That Regard?, Chandrababu, Tdp, Ap Poltics ,-TeluguStop.com

రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు ప‌దేండ్ల పాటు ఏపీని పాలించిన ఘ‌న‌త కూడా ఉంది.అయితే జ‌గ‌న్ సీఎం అయ్యాక ఆయ‌న రాజ‌కీయ గ్రాఫ్ ప‌డిపోయింది.

చివ‌ర‌కు క‌న్నీరు పెట్టే దాకా వ‌చ్చింది.ఇక టీడీపీ క‌నుమ‌రుగ‌వుతుందనే స‌మ‌యంలో బాబులో మ‌రింత క‌సిరేగిన‌ట్టు క‌నిపిస్తోంది.

ఇందుకు కాసింత వివాదంతో పాటు ఉద్యోగ సంఘాల ఉద్యమాలు క‌లిసొచ్చాయి.ఇక నుంచి కొత్త పంథాలో పార్టీని న‌డిపించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కూట‌మిని ఏర్పాటు చేసే ప్లాన్‌లో ఉన్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.ఇందుకు త‌గ్గ‌ట్టు సీనియ‌ర్ నేత‌ల‌తో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

కూట‌మి కాక‌పోయినా అఖిల‌ప‌క్షంగా కార్యాచ‌ర‌ణ రూపొందించి ఉద్య‌మ బాట ప‌ట్టాల‌నే ఐడియాలో ఉన్నార‌ని తెలిసింది.వైసీపీ ప్ర‌భుత్వంను వ్య‌తిరేకించే, టీడ‌పీతో జ‌త‌క‌ట్టే పార్టీల‌తో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ చేయాల‌నే ఐడియా లో ఉన్న‌ట్టు స‌మాచారం.

Telugu Ap Poltics, Chandra Babu, Chandrababu, Ys Jagan, Ysrcp-Telugu Political N

ఉద్యోగ సంఘాలు త‌ల‌పెట్టిన చ‌లో విజ‌య‌వాడ స‌క్సెస్ కావ‌డం… వారికి ప్ర‌జ‌లు అండ‌గా నిల‌వ‌డంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం దిగొచ్చి చ‌ర్చ‌లు జ‌రిపి కొన్ని డిమాండ్లు ప‌రిష్క‌రించిన విష‌యం విధిత‌మే.ఇదే త‌ర‌హాలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఉద్య‌మాలు చేయాల‌న్న‌ది చంద్ర‌బాబు ప్లాన్‌.వైసీపీ మినహా ఇత‌ర అన్ని పార్టీల కార్య‌క‌ర్త‌ల‌ను స‌మాయ‌త్తం చేసే  ఆలోచ‌న‌లో ఉన్నట్టు తెలిసింది.

Telugu Ap Poltics, Chandra Babu, Chandrababu, Ys Jagan, Ysrcp-Telugu Political N

ఏపీ ఎన్నిక‌లకు మ‌రో రెండేండ్లు మాత్ర‌మే ఉన్నాయి.ఇప్ప‌టి వ‌ర‌కూ ఏపీలో అభివృద్ధి క‌న‌పించ‌ట్లేదు.ప‌థ‌కాలు త‌ప్ప జ‌గ‌న్ ప్రభుత్వం ఒర‌గ‌బెట్టిందేమీ లేదు.

అనేక స‌మ‌స్య‌ల‌తోపాటు ఆర్థిక ఇబ్బందుల‌తో కొట్టుమిట్టాడుతోంది.ఉద్యోగుల‌కు స‌క్ర‌మంగా జీతాలు చెల్లించ‌లేని ప‌రిస్థితిలో ఉంద‌నే ఆరోప‌ణ‌లొస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ప్రభుత్వ వ్యతిరేకత దృష్ట్యా బ‌ల‌మైన ఉద్య‌మం చేప‌ట్టి జ‌గ‌న్‌ను ఇర‌కాటంలో పెట్టే ప్లాన్‌లో చంద్రబాబు ఉన్న‌ట్టు స‌మాచారం.ఎన్నిక‌ల పొత్తు లేకుండా త‌మ‌తో జ‌త‌ట్టే పార్టీల‌తో ఉద్య‌మ బాట ప‌ట్ట‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్టు తెలిసింది.

ఇది కార్య‌రూపం దాలిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube